పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఇచ్చింది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని, ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, వారితో కలిసి విందు ఆరగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన చాటిచెప్పారు.
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట: ఇఫ్తార్ విందు అనంతరం ముస్లిం సోదరులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాజధాని అమరావతిలో బ్రహ్మాండమైన హజ్ హౌస్ నిర్మిస్తామని ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
-
భరోసా: “ముస్లిం మైనార్టీల హక్కులకు భంగం కలగకుండా చూస్తాం. మీ రక్షణ బాధ్యత మాది” అని సీఎం హామీ ఇచ్చారు.
-
పథకాల పునరుద్ధరణ: గతంలో నిలిచిపోయిన దుల్హన్, విదేశీ విద్య వంటి పథకాలను కూటమి ప్రభుత్వం మళ్లీ అమలు చేస్తుందని, ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.
-
రంజాన్ తోఫా: పండుగ కానుకగా పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
వేడుకలో కోలాహలం: ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు మైనార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మత పెద్దలు ముఖ్యమంత్రికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, దుశ్శాలువతో సత్కరించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ముస్లిం మత గురువులు ప్రత్యేక దువా (ప్రార్థన) నిర్వహించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విజయవాడలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మైనార్టీ వర్గాలతో చంద్రబాబు ఆత్మీయంగా మమేకం కావడం గమనార్హం.
ముస్లిం సోదరుల గౌరవార్థం ప్రతి రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇవ్వడాన్ని దశాబ్దాలుగా ఒక సాంప్రదాయంగా పాటిస్తున్నాను. ఈ క్రమంలో నేడు విజయవాడలో ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇఫ్తార్ విందులో, ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నాను. మైనారిటీ వర్గ గౌరవానికి, అభివృద్దికి ప్రభుత్వం… pic.twitter.com/PZscEnbx7w
— N Chandrababu Naidu (@ncbn) March 16, 2026




































