
చంద్రబాబు పాలనలో పగ, ప్రతీకారాలకు చోటు ఉండదంటూ తెలుగు దేశం పార్టీ తన అధికారిక వెబ్ సైట్లో స్పష్టం చేసింది. దీనికి నిలువెత్తు నిదర్శనంగా మాజీ సీఎం జగన్ బొమ్మ ముద్రించి ఉన్న స్కూల్ బ్యాగులను ఈ ఏడాది తమ టీడీపీ ప్రభుత్వంలో కూడా పంపిణీ చేయడానికి మార్గం సుగమం చేసింది. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో చంద్రబాబు పాలన ఎలా ఉంటుందో అన్న చర్చ మొదలయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశాక కక్ష సాధింపు చర్చలుంటాయా అన్న వార్తలు వినిపించాయి. అయితే దీనికి జనసేన అధినేత ఎప్పుడో క్లారిటీ ఇచ్చేయగా..తాజాగా చంద్రబాబు నాయుడు కూడా క్లారిటీ ఇచ్చేసారు.
ఏపీలో కొన్ని పాలనాపరమైన మార్పులకు చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు. బాబు పాలనలో పగ, ప్రతీకారాలకు చోటు ఉండదంటూ తెలుగు దేశం పార్టీ తన అధికారిక వెబ్ సైట్లో స్పష్టం చేసింది. మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి బొమ్మ ముద్రించి ఉన్న స్కూల్ బ్యాగులను ఈ ఏడాది తమ టీడీపీ ప్రభుత్వంలో కూడా పంపిణీ చేయడానికి ఓకే చెప్పేసింది. దీంతో ఒకవిధంగా తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దూరంగా ఉంటామని చెబుతూనే ప్రజాధనం దుర్వినియోగం చేయం అనే సందేశాన్ని ఏపీ ప్రజలకు వినిపించినట్లు అయింది.
గత ప్రభుత్వ హయాంలో జగన్ మార్కు పాలనతో విసిగిపోయిన ప్రజలకు చంద్రబాబు నిర్ణయం ఊరట నిచ్చింది. అభివృద్ధిని గాలికి వదిలేసి ఎంతసేపు కాలేజీలకు, పాసు పుస్తకాలకు, స్కూలు బ్యాగులు ఇలా అన్నిటిపై వైఎస్సార్, జగన్ ఫోటోలను ముద్రించడానికే జగన్ మొగ్గు చూపించడంపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి.
గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడిందని అన్న సీఎం చంద్రబాబు..అందులో భాగంగానే మాటలకు తగ్గట్టు చేతలకు పనిపెట్టారు. గతంలో విద్యా కనుక పేరుతో మాజీ సీఎం వైఎస్ జగన్ బడికి వెళ్లే పిల్లలకు ఒక కిట్‌ను అందజేశారు.ఆ కిట్ లో స్కూల్ బ్యాగు, నోట్ పుస్తకాలు, యూనిఫారం, బూట్లు, సాక్సులు, బెల్డ్, టై ఉండేవి. అయితే అలా విద్యార్ధులకు అందజేసే కిట్ పై జగన్ బొమ్మను ముద్రించి ఇచ్చే వారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందనే భావనతో చంద్రబాబు తిరిగి అవే కిట్లను విద్యార్థులకు అందజేసేలా ఆదేశాలు జారీ చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE