నేడు వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు అర్పించిన సీఎం జగన్‌, కుటుంబ సభ్యులు

CM Jagan and Family Members Pays Tribute To YSR on His Death Anniversary at Idupulapaya Kadapa, CM YS Jagan Pay Tributes To YSR, CM YS Jagan And Family Tributes To YSR, AP CM YS Jagan Mohan Reddy, YSR Death Anniversary, Mango News, Mango News Telugu, YS Jagan Vist To Idupulapaya Kadapa, YS Jagan Mohan Reddy Latest News And Updates, Jagan And Family Members Tribute YSR, YSR Idupulapaya, CM YS Jagan Kadapa Tour

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ కడప జిల్లాలో రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు, ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మి, సతీమణి భారతి, సోదరి మరియు వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల మరియు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైఎస్సార్‌ వర్థంతి సందర్భంగా ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. కాగా ఈరోజు తన తండ్రి వర్ధంతి నేపథ్యంలో.. సీఎం జగన్ వైఎస్సార్ ను తలుచుకుంటూ తన ట్విట్టర్ లో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం పులివెందుల నియోజకవర్గ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పనితీరుపై స్థానిక నాయకులతో సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ