ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళల్లో మార్పు మే నెలాఖరు వరకు పొడిగింపు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP Govt Issued Orders on Extension of Change in Working Hours at Government Offices till May End,Mango News,Mano News Telugu,AP Govt,AP Govt News,Government Offices,Government Offices News,AP Government Offices,AP Government Offices Working Hours,AP Government Offices Working Hours News,AP Government Offices New Timings,Lockdown in Andhra Pradesh,AP Govt Issued Orders,AP Govt Issued Orders on Working Hours at Government Offices,Working Hours at AP Government Offices,AP Government Extended Change In Working Hours Of Government Offices,andhra pradesh,AP CM YS jagan,Coronavirus,Covid-19,Andhra Pradesh Government,Government Office Timings,Lockdown Curfew In AP,AP Government Office Timings

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5వ తేదీ నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పనివేళలను ఏపీ ప్రభుత్వం మార్పు చేసింది. అన్ని శాఖలు, సెక్రటేరియట్, హెడ్ఓడి, జిల్లా, సబ్‌ డివిజన్‌ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే పనిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. కాగా ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో చేసిన మార్పులను ఏపీ ప్రభుత్వం తాజాగా మరోసారి పొడిగించింది. మే నెలాఖరు వరకు ఉద్యోగులకు ఇవే పనివేళలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

ఉద్యోగుల పనివేళలు మార్పులకు సంబంధించి ముందుగా మే 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నియంత్రణలో అత్యవసర సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ, మునిసిపల్‌ పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, ఇంధన శాఖలకు ఈ పని వేళలు వర్తించవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఎవరైనా ఉద్యోగులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కార్యాలయాల్లో ఉండాలంటే వారు కచ్చితంగా ప్రత్యేక పాసులు కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విభాగాల పనిని బట్టి ఎంత మంది ఉద్యోగులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా కార్యాలయాల్లో ఉండాలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + four =