ఎలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చే యోచనలో జగన్

Jagan is planning to change the sitting MLA of Elamanchili , MLA of Elamanchili, Jagan,AP CM Jagan Latest News and Live Updates,Elamanchili, MLA Kannababuraju, YCP, AP Elections,Jagan likely to deny tickets to 50 MLAs for 2024 election, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan Mohan Reddy,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates, Jagan Latest Updates,AP Latest Political News,Mango News telugu,Mango News
Elamanchili, MLA Kannababuraju, YCP, AP Elections

పెద్ద సంఖ్యలో సిట్టింగ్‌లను మార్చుతూ సంచలనానికి తెరలేపారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా సిట్టింగ్‌లను మారుస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు జాబితాలు ప్రకటించిన జగన్ 50 అసెంబ్లీ స్థానాలు.. 9 లోక్ సభ స్థానాలకు సిట్టింగ్‌లను మార్చేశారు. త్వరలో అయిదో జాబితాను కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ జాబితాలో ఏయో స్థానాలకు సిట్టింగ్‌లను మార్చుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఈక్రమంలో విశాఖ జిల్లా ఎలమంచిలి స్థానం పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఎలమంచిలి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కన్నబాబురాజు ఉన్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఎలమంచిలి నుంచి పోటీ చేసి కన్నబాబు గెలుపొందారు. ఆ తర్వాత కొద్దిరోజులు రాజకీయాలకు దూరమైన కన్నబాబు తిరిగి 2019లో వైసీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎలమంచిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే మొదట్లో బాగానే ఉన్నప్పటికీ క్రమక్రమంగా కన్నబాబు గ్రాఫ్ నియోజకవర్గంలో తగ్గతూ వచ్చింది. ప్రజాబలం కూడా ఆయనకు తగ్గిపోయింది. ఈక్రమంలో కన్నబాబును ఈసారి సైడ్ చేయాలని జగన్ భావిస్తున్నారట.

ఎలమంచిలి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అలాగే బీసీ ఓటర్లు కూడా అధికమే. అటు పొత్తు ధర్మంలో భాగంగా ఎలమంచిలి నుంచి జనసేన పోటీ చేయనుందట. కాపు సామాజిక వర్గానికి చెందిన సుందరపు విజయకుమార్‌ను జనసేన తరుపున ఎలమంచిలి నుంచి బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోందట. ఈక్రమంలో విజయకుమార్‌ను ఢీ కొట్టేందుకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎలమంచిలి నుంచి బరిలోకి దింపాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట.

ఈక్రమంలో వైసీపీ అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ బొడ్డేడ ప్రసాద్ పేరు తెరపైకి వస్తోంది. ప్రసాద్ గవర సామాజిక వర్గానికి చెందిన వారు. ఈక్రమంలో ఎలమంచిలి నుంచి కన్నబాబును తప్పించి ప్రసాద్ కుమార్‌ను పోటీ చేయించాలని జగన్ అనుకుంటున్నారట. అయితే అటు కన్నబాబు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదట. ఈసారి కూడా తనకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ వద్ద పట్టుపట్టుకొని కూర్చున్నారట. ఈక్రమంలో వైసీపీ హైకమాండ్ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చివరికి కన్నబాబుకు వైసీపీకి షాక్ ఇస్తుందా..? లేదా? చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + four =