
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేసేలా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న రాబోయే ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల క్రితం పోలింగ్ ముగియగా, ఏపీలో అధికారంలోకి వచ్చేది ఏపార్టీ అనేది చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా దాని గురించే చర్చ. పోలింగ్ ముగిసిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ఏపీలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని, 23 ఎంపీ సీట్లు గెలుస్తామని జోష్యం చెప్పారు. ఈ నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. ఆ ఫలితాలు సామాన్యంగా ఉండబోవని, దేశం మొత్తం మనవైపే చూస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఐదేళ్లపాటు ప్రజలకు మంచి పాలన అందించామని, ప్రజలు మనకు మంచి ఫలితాలు అందించబోతున్నారని వెల్లడించారు. జూన్ 4న వచ్చే ఫలితాలను చూసి.., దేశంలోని అన్ని రాష్ట్రాలూ మనల్నే చూస్తాయన్నారు. ఐ ప్యాక్ సేవలు మరువలేనివని తెలిపారు. విజయవాడలోని ఐ ప్యాక్ బృందంతో సమావేశమైన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి గతం కన్నా ఎక్కువ ఫలితాలు వస్తాయన్నారు. 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీల మార్క్ దాటబోతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు కూడా జగన్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో వైసీపీ ఓడిపోతోందని ఎన్నికల ముందు పీకే జోష్యం చెప్పారు. దీనికి తాజాగా జగన్ రిప్లయ్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ మధ్యలో మాట మార్చాడాని, పీకే కూడా కలలో ఊహించని ఫలితాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఏడాదిన్నరగా ఐప్యాక్ బృందం చేస్తున్న గొప్పదని కొనియాడారు. గతంలో పీకే ఐప్యాక్ బృందంలో ఉండేవారు. కొద్ది కాలం క్రితం ఆయన ఆ బృందం నుంచి బయటకు వచ్చేశారు. జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.
2019లో వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు వస్తాయని ఎవరూ ఊహించలేదంటూ గుర్తు చేశారు. ప్రజలు సుపరిపాలనను చూసి ప్రజలు మద్దతు ఇస్తారన్నారు. ప్రశాంత్ కిశోర్ మనకు వ్యతిరేకంగా మారారని.. అతను కూడా ఊహించలేని సీట్లు వస్తాయన్నారు. ప్రశాంత్ కిశోర్ చేసేది ఏమీ లేదని.. అంతా ఐప్యాక్ టీం చేస్తుందని.. వచ్చే ప్రభుత్వంలో ఐదేళ్ల ప్రజలకు ఇంకా మేలు చేద్దామన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందన్నారు. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఉత్కంఠగా మారాయి. జగన్ అంత ధీమాగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. మహిళలు, వృద్ధుల ఓటింగ్ ఎక్కువగా ఉండడంతోనే వారు తమ వైపే ఉంటారని భావిస్తూ జగన్ ధీమాగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY