లవ్ బ్రెయిన్ డిసీజ్ ఏమో చెక్ చేసుకోండి

love brain,Xiaoyu,Love brain disease,Calling your partner repeatedly,Check out Love Brain Disease
love brain,Xiaoyu,Love brain disease,Calling your partner repeatedly,Check out Love Brain Disease

చైనాలో జియావోయు ఓ యువతి లవ్ బ్రెయిన్ అనే మానసిక వ్యాధి బారిన పడినట్లు అక్కడి డాక్టర్లు తేల్చారు.  ఆమె తన బాయ్ ఫ్రెండ్‌కు రోజులో వందసార్లకు పైనే  ఫోన్ చేసి.. ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావంటూ  పదేపదే ప్రశ్నించేదని డాక్టర్లు తెలిపారు. అతడెప్పుడు కూడా తన పక్కనే ఉండాలని ఆ పేషెంట్ కోరుకునేదని  డాక్టర్లు చెప్పారు.

లవ్ బ్రెయిన్ అంటే ఏమిటనే ప్రశ్నకు డాక్టర్లు జవాబిచ్చారు. చైనాలోని జియావోయు అనే యవతికి బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్లు అక్కడి డాక్టర్లు  నిర్ధారణ చేశారు. ఈ మానసిక వ్యాధిని వ్యవహారికంగా లవ్ బ్రెయిన్ అని పిలుస్తారని తెలిపారు.  డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్,యాంక్జైటీ వంటివి ఎక్కువ అవడంతో..ఆమె ఈ పరిస్థితికి చేరుకుందని వివరించారు. మొదటిలోనే  జియావోయుకు చికిత్స అందించి ఉంటే  పరిస్తితి ఇంత వరకూ వచ్చేది కాదని.. ఇప్పుడు కూడా ఆమె త్వరగానే కోలుకుందని అంటున్నారు.

జియావోయు  పైచదువుల కోసం యూనివర్సిటీకి వెళ్లేంత వరకు..అంటే ఆమె  ఆ 18 సంవత్సరాల వయస్సున్నంత వరకూ తను ఆరోగ్యంగానే  ఉంది. యూనివర్సిటీలో జియావోయు  ఒక యువకుడితో ప్రేమలో పడింది.  కానీ చదువు పూర్తయ్యాక ఆ యువకుడు జియావోయుతో ముందు గడిపినంత సమయం గడపలేకపోవడంతో..ఆమె అసౌకర్యానికి గురయింది. అలా  ఇద్దరి మధ్య ఇంకాస్త దూరం పెరగడంతో..ఆ యువతిలో అభద్రతాభావం మరింత పెరిగిపోయి అది కాస్తా లవ్ బ్రెయిన్ గా మారింది.

జియావోయు ఎప్పుడూ తన బాయ్ ఫ్రెండ్ నుంచి   అటెన్షన్‌ను కోరుకునేది. పగలు,రాత్రి తేడా లేకుండా కాల్స్, వీడియో కాల్స్ తో విసిగించేది. చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో జియావోయుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో..ఆమె ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఆ వీడియోలో జియావోయే తన బాయ్ ఫ్రెండ్ కు వీచాట్ కెమెరా స్విచ్ ఆన్ చేయాలని చెబుతుంది. ఆ తర్వాత కంటెన్యూస్‌గా కాల్స్ చేసినా .. అతని నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తన ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ పగులగొట్టింది. దీంతో అక్కడ ఏదో అవుతుందని ఊహించిన జియావోయు బాయ్ ఫ్రెండ్  పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో ఆమె ఇంటికి పోలీసులు చేరుకుంటారు కానీ వారిని చూసిన జియావోయు  బాల్కనీ నుంచి దూకేస్తానని బెదిరించింది.ఈ వీడియో ఇప్పుడు అక్కడ వైరల్ అవుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =