ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నూతన మార్గదర్శకాలతో కూడిన ‘వైఎస్ఆర్ బీమా’ పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ వర్తించే ఈ పథకం కింద కుటుంబ పోషకులు(కుటుంబంలో సంపాదించే వ్యక్తి) సహజ మరణం పొందినా, ప్రమాదవశాత్తు చనిపోయినా పరిహారం అందేలా వైఎస్ఆర్ బీమా పథకానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు.
ఈ పథకం ద్వారా 2021-22 సంవత్సరానికి గానూ రాష్ట్రంలో 1.32 కోట్ల పేద కుటుంబాలకు దాదాపు రూ.750 కోట్ల వ్యయంతో ఉచిత బీమా రక్షణ కల్పించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని, రూ.5లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారిని ఆరోగ్యశ్రీలో చేర్చామని చెప్పారు. అలాగే 1000కి పైగా రోగాలను గుర్తించి ఆరోగ్యశ్రీలో చేర్చామని, కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా అమలు చేస్తామని అన్నారు.
వైఎస్ఆర్ బీమా ద్వారా 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తి సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందిస్తామన్నారు. 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం పొందినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందిస్తామన్నారు. బీమా చెల్లింపునకు అయ్యే పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, బ్యాంకులతో సంబంధం లేకుండా జులై 1 నుంచి వైఎస్ఆర్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ పథకంపై ఎవరికి ఎటువంటి సందేహాలు ఉన్నా 155214 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి, నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ