సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్రకేసరిగా పేరుగాంచిన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. నేడు ఆయన జయంతి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో టంగుటూరి చిత్రపటం వద్ద పూలుజల్లి సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్, టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే ట్విటర్‌లో కూడా ప్రకాశం పంతులు త్యాగనిరతిని గుర్తు చేసుకున్నారు. ‘స్వాతంత్య్ర సంగ్రామ పథంలో తెలుగు వారి కీర్తి పతాక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారు వేసిన పునాదులు విశేషమైనవి. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
స్వాతంత్ర్య సంగ్రామపథంలో తెలుగువారి కీర్తి పతాక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడ్డ ఆంధ్రరాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారు వేసిన పునాదులు విశేషమైనవి. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY