యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి హర్షసాయి వీడియోల గురించి బాగా తెలుసు. మొదట్లో యూట్యూబర్‌గా కెరియర్ ప్రారంభించిన హర్షసాయి..ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్రర్‌గానూ మారిపోయాడు. వెరైటీ కాన్సెప్ట్‌లు, క్రియేటివ్ థాట్స్‌తో రీల్స్, వీడియోలు, షార్ట్ వీడియోలు చేసి బాగా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా పేదవాళ్ల ఇంటి ముందుకు వెళ్లి వాళ్లకు తెలీకుండా సాయం చేసిన వీడియోలతో హర్షసాయి బాగా పేమస్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో హర్షసాయికి ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఏర్పడింది.
త్వరలో వెండితెరపై కూడా హర్షసాయి అడుగుపెట్టబోతున్నాడు. మెగా పేరుతో ఓ పాన్ ఇండియా రేంజ్లో లీడ్ రోల్‌లో హర్షసాయి నటిస్తున్నాడు. ఇటీవలే ఈ టీజర్‌ను కూడా లాంచ్ చేశారు. అయితే తాను సంపాదించిన సొమ్ములో.. కొంత పేదలకు పంచి పెడుతూ పాపులారిటీ పొందిన హర్షసాయిపైన చాలా విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమ బెట్టింగ్ యాప్స్‌ను హర్షసాయి ప్రమోట్ చేసి కొద్ది సమయంలోనే కోట్లు సంపాదించినట్లు కొంతకాలం నుంచీ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు తాజాగా పెళ్లిపేరుతో హర్షసాయి మోసం చేశాడంటూ బిగ్ బాస్ పాత కంటెస్టెంట్ ఫిర్యాదు చేయడంతో..మరోసారి వార్తల్లోకి ఎక్కాడు హర్షసాయి.
తనను ప్రేమ, పెళ్లి పేరుతో హర్షసాయి మోసం చేశాడని యువతి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపైన కూడా ఆ యువతి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. హర్షసాయిపై ఫిర్యాదు చేసేందుకు ఏకంగా అడ్వొకేట్ సహా నార్సింగి పీఎస్‌కు వెళ్లిన ఆ యువతి. పెళ్లి చేసుకుంటానని 2కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదు చేసింది.