ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. అన్ని పార్టీలు పోటాపోటీగా పావులు కదిపాయి. గెలుపే లక్ష్యంగా చమటోడ్చాయి. చివరికి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. పాలన కూడా మొదలు పెట్టింది. అటు ఎన్నికల ముంగిట ఏపీలో హడావుడి చేసిన కాంగ్రెస్ పార్టీ చివరికి వచ్చే సరికి చితకలపడిపోయింది. 10-15 అసెంబ్లీ.. 4-6 పార్లమెంట్ స్థానాలను గెలుస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసినప్పటికీ.. చివరికి ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. కడప నుంచి ఎంపీగా పోటీ చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా ఓటమిని చవిచూశారు. బస్సుయాత్ర చేపట్టి.. మైకులు పగిలిపోయేలా ప్రచారం చేసినప్పటికీ షర్మిలకు మాత్రం ఓటమి తప్పలేదు.
అయితే ఏపీలో కూడా కాంగ్రెస్.. కమ్యూనిస్ట్ పార్టీలతో జట కట్టి ఎన్నికలకు వెళ్లింది. అయితే ఈసారి ఎన్నికల్లో కామ్రేడ్స్ .. కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరోక్షంగా టీడీపీ కూటమికి కామ్రేడ్స్ మద్ధతిచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ తమకు అంతర్గతంగా కామ్రేడ్స్ కలిసి వచ్చారని వ్యాఖ్యానించారు. దీంతో ప్రచారంలో ఉన్న ఆరోపణలకు బలం చేకూరినట్లు అయింది.
ఈ విషయాన్ని కమ్యూనిస్టు పార్టీలకు చెందిన పెద్దలు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ కమ్యూనిస్టు నేత ‘మేం ఎంత కంట్రోల్ చేసినా.. జరగాల్సిన తప్పు జరిగిపోయింది. చేయి దాటిపోయింది. మావోళ్లు టీడీపీ, జనసేన పార్టీలకు అనుకూలంగా పనిచేశారు. గతంలో ఉన్న పరిచయాలు పనిచేశాయని మేము గుర్తించాం. జరగాల్సింది అంతా జరగిపోయింది. ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదు’ అంటూ వ్యాఖ్యానించారట. దీంతో ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE