పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం, రూ.1124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల: సీఎం వైఎస్ జగన్

CM YS Jagan Released Rs 1124 Cr Incentives, MSMEs, Spinning, Textile Industries, YS Jagan Mohan Reddy, Incentives For MSMEs And Textile Industries, Mango News, Latest Political News, Andhra pradesh Breaking News, Chief Minister of Andhra Pradesh, MSMEs And Textile Industries, AP CM YS Jagan Mohan Reddy, YSRCP Government, MSME sector, AP Government, Jagan Mohan Reddy Government

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్ మిల్స్/టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు ఊతమిస్తూ రూ.1124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి సీఎం వైఎస్ జగన్ ఈ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, చిన్నతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు శ్రీకారం చుట్టామని, పరిశ్రమల ఏర్పాటు ద్వారా 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేశామన్నారు. ప్రభుత్వం పరిశ్రమలకు ఇన్సెంటివ్స్‌ ఇస్తుందనే నమ్మకం కలిగించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు.

ముఖ్యంగా ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోతే పారిశ్రామిక రంగం క్షీణిస్తుందని, అందుకే అప్పు చేసైనా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం వైఎస్ జగన్‌ అన్నారు. తమ ప్రభుత్వంలో పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలోని బకాయిలు రూ.1,588 కోట్లను చెల్లించామని, ఇప్పటివరకు మొత్తం రూ.2,086 కోట్ల ప్రోత్సాహకాలు అందించామని తెలిపారు. అలాగే పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం చేశామని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపడుతుందని, ఎంఎస్‌ఎంఈలను ఆదుకుంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =