ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తన మార్క్ చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు వైఎస్ షర్మిల. ముఖ్యంగా కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మంచి మార్కులు కొట్టేశారు. హైకమాండ్‌ను తనవైపు తిప్పుకుంటున్నారు. తాజాగా వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ ఎంతలా అండగా ఉందనేది.. షర్మిలను హైకమాండ్ ఎంతలా నమ్ముతుందనేది మరోసారి రుజువయింది. షర్మిల హైకమాండ్‌కు చేసిన ఒక్క ఫిర్యాదుతో ఇద్దరు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లను హైకమాండ్ తొలగించేసింది. వారు ఇటీవల షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో.. హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కొందరు నేతలు.. ఈ దెబ్బతో ఆమె వైపు చూడాలంటేనే వణికిపోతున్నారు. ఆమెతో పెట్టుకుంటే ఎక్కడ పదవులు ఊడుతాయోనని భయపడిపోతున్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయిన విషయం తెలిసిందే. పలువురు నేతలు కనీసం డిపాజిట్లను కూడా దక్కించుకోలేదు. వైఎస్ షర్మిల కూడా ఓడిపోయారు. దీంతో కొందరు నేతలు మీడియా ముందుకు వచ్చి బహిరంగంగానే షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలు షర్మిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికలవేళ షర్మిల పనితీరును ప్రశ్నించారు. షర్మిల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫండ్స్‌ను షర్మిల సరిగ్గా ఉపయోగించుకోలేదని ఆరోపించారు. మాజీ కాంగ్రెస్ నేతలను తిరిగి ఒక్క తాటిపైకి తీసుకురావడంలో షర్మిల పూర్తిగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.
అయితే వారు చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన కాంగ్రెస్ హైకమాండ్.. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి, జంగా గౌతమ్, మస్తాన్ వలీలను పదవుల నుంచి తొలగించింది. ఈ ఘటనతో కాంగ్రెస్ హైకమాండ్ పూర్తిగా వైఎస్ షర్మిల వైపే ఉందన్న విషయం మరోసారి రుజువయింది. ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావడం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం కేవలం వైఎస్ షర్మిలతోనే సాధ్యం అని కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా నమ్ముతోంది. అందుకే షర్మిలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఈ ఘటనతో మిగతా నేతలు కూడా వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే ఆలోచిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE