కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుండడంతో కరోనా వ్యాప్తి పై చేపట్టాల్సిన చర్యల గురించి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ లేఖ రాశారు. ఆయా రాష్ట్రాల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు, వైరస్ వ్యాప్తి చెందుతున్న విధానం, తదితర అంశాల ఆధారంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్ జోన్లలో మార్పులు చేసి కొత్త జాబితా విడుదల చేస్తునట్టు తెలిపారు. రాష్ట్రాల విజ్ఞప్తి, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని ఆ మేరకు మార్పులు చేసినట్టు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా 130 రెడ్ జోన్ జిల్లాలు, 284 ఆరెంజ్ జోన్ జిల్లాలు, 319 గ్రీన్ జోన్ జిల్లాలు ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రెడ్ జోన్ లో 6, ఆరెంజ్ జోన్ లో 18, గ్రీన్ జోన్ లో 9 జిల్లాలు ఉన్నాయి. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో రెడ్ జోన్ లో 5, ఆరెంజ్ జోన్ లో 7, గ్రీన్ జోన్ లో 1 జిల్లా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ జోన్ జిల్లాలు:
- కర్నూలు
- గుంటూరు
- కృష్ణా
- నెల్లూరు
- చిత్తూరు
ఆంధ్రప్రదేశ్ లో ఆరెంజ్ జోన్ జిల్లాలు:
- తూర్పుగోదావరి
- పశ్చిమగోదావరి
- ప్రకాశం
- కడప
- అనంతపురం
- శ్రీకాకుళం
- విశాఖ
ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ జోన్ జిల్లాలు:
- విజయనగరం
సంబంధిత వార్తలు:
తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ జిల్లాల జాబితా…
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu