రాష్ట్ర బడ్జెట్ పై చంద్రబాబు స్పందన

Chandrababu Naidu Comments On AP Budget,Mango News,AP Assembly Budget Sessions 2019 Highlights,Nara Chandrababu Naidu Sensational Comments On Andhra Pradesh Assembly Budget Sessions 2019,Highlights of AP Budget 2019-20,Latest Andhra Pradesh News,Ap Political News

శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ బడ్జెట్ ఏ విధంగానూ పేదల సంక్షేమానికి దోహద పడేలా లేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలకు, చేతలకు పొంతనే లేదనడానికి ఈ బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం అని పేర్కొన్నారు. బీసీల సంక్షేమానికి నిధుల్లో కోత పెట్టారని, తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారన్న అక్కసుతోనే ఈ బడ్జెట్ లో బిసిలకు కేటాయింపులు తగ్గించారని చెప్పారు. సున్నా వడ్డీ రుణాలకు సంబంధించి, తెలుగుదేశం పార్టీ ని శాసనసభలో పదే పదే విమర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సున్నా వడ్డీ రుణాలకు రూ.4వేల కోట్లు అవసరం ఉంటే రూ.100కోట్లు మాత్రమే కేటాయించడంపై రైతులకు ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో శరవేగంగా నిర్మాణంలో ఉన్న ప్రధాన అభివృద్ది ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ లో కోతలు విధించడం, నీటి పారుదల ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపుల్లో 22% కోత పెట్టడం ద్వారా పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదనేది తేలిపోయిందన్నారు. అమ్మఒడి పథకం ‘ఆంక్షల బడి’గా మార్చారని, బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అని చూడకుండా ప్రతి తల్లికి ఇస్తామని చెప్పి, బడ్జెట్ లో 43లక్షల మంది తల్లులకు మాత్రమే ప్రయోజనం కలుగుతుందని చెప్పారని, ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఉన్న 78లక్షల మంది తల్లులలో ఎవరికి అమ్మఒడి కోత విధిస్తారో చెప్పలేదని విమర్శించారు.

రాజధానికి రూ.500కోట్లు, కడప స్టీల్ ప్లాంట్ కు రూ.250కోట్లు కేటాయించి వాటితో పనులు ఎలా పూర్తి చేస్తారని, కనీసం స్టీల్ ప్లాంట్ భూమి చదునుకు కూడా ఆ నిధులు చాలవు అని విమర్శించారు. విమాన సర్వీసులు రద్దు చేస్తే రాజధానికి ఎవరు వస్తారు, పెట్టుబడులు ఎలా వస్తాయి, పారిశ్రామిక రాయితీలకు రూ.4వేల కోట్లు చెల్లించాల్సి వుండగా, గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్ లో 0.88% తగ్గించారని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.500కోట్లు మాత్రమే కేటాయించడాన్ని బట్టే అమరావతి పనులకు శ్రద్ధ చూపడం లేదని తెలుస్తుందని, ఇప్పటికే ఇక్కడ పనులు నిలిచిపోవడంతో భూముల ధరలు పడిపోయి,రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ కి తరలిపోయిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఆకాశంలో ఉంటే, వాటికి బడ్జెట్ కేటాయింపులు మాత్రం పాతాళంలో ఉండటం వైకాపా ప్రభుత్వ చేతకాని తనమే అని చంద్రబాబు దుయ్యబట్టారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here