కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ గడువు మే 3వ తేదీతో ముగియనుండడంతో కరోనా వ్యాప్తి పై చేపట్టాల్సిన చర్యల గురించి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ లేఖ రాశారు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు, వైరస్ వ్యాప్తి చెందుతున్న విధానం, తదితర అంశాల ఆధారంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్ జోన్లలో మార్పులు చేసి కొత్త జాబితా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 130 రెడ్ జోన్ జిల్లాలు, 284 ఆరెంజ్ జోన్ జిల్లాలు, 319 గ్రీన్ జోన్ జిల్లాలను గుర్తించినట్టు ప్రకటించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో రెడ్ జోన్ లో 6, ఆరెంజ్ జోన్ లో 18, గ్రీన్ జోన్ లో 9 జిల్లాలు ఉన్నాయి.
తెలంగాణాలో రెడ్ జోన్ జిల్లాలు:
- హైదరాబాద్
- సూర్యాపేట
- రంగారెడ్డి
- మేడ్చల్ మల్కాజిగిరి
- వికారాబాద్
- వరంగల్ అర్బన్
తెలంగాణలో ఆరెంజ్ జోన్ జిల్లాలు:
- నిజామాబాద్
- జోగులాంబ గద్వాల
- నిర్మల్
- నల్గొండ
- ఆదిలాబాద్
- కామారెడ్డి
- సంగారెడ్డి
- కొమరం భీం-అసిఫాబాద్
- ఖమ్మం
- కరీంనగర్
- మహబూబ్ నగర్
- జగిత్యాల
- రాజన్న సిరిసిల్ల
- జయశంకర్ భూపాలపల్లి
- మెదక్
- జనగాం
- నారాయణపేట
- మంచిర్యాల
తెలంగాణలో గ్రీన్ జోన్ జిల్లాలు:
- పెద్దపల్లి
- నాగర్ కర్నూల్
- ములుగు
- భద్రాద్రి కొత్తగూడెం
- మహబూబాబాద్
- సిద్దిపేట
- వరంగల్ రూరల్
- వనపర్తి
- యాదాద్రి భువనగిరి
సంబంధిత వార్తలు:
కరోనా ఎఫెక్ట్: ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ జిల్లాల జాబితా ఇదే …
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]