రాజకీయాలెప్పుడూ నువ్వొకటి అంటే నేను రెండు అంటా అనే విధంగానే సాగుతూ ఉంటాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చీ రాగానే ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన తొలి కీలక ఆదేశం ప్రజా వేదికను కూల్చివేయమనే. అది కేవలం కక్ష సాధింపు చర్యగానే భావించిన టీడీపీ..అప్పట్లో పెద్ద గొడవే చేసింది. అటు సామాన్యుల నుంచి కూడా ప్రభుత్వంపై ఆదిలోనే వ్యతిరేకత ఎదురయింది. ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం మారింది. అయితే తాడేపల్లిగూడెంలో కూల్చివేత సీన్ రిపీట్ అయింది.
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ సెంట్రల్ పార్టీ ఆఫీస్‌ని కూటమి ప్రభుత్వం కూల్చివేసింది. అక్కడ కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని పోలీసుల భద్రత నడుమ సీఆర్డీయే అధికారులు కూల్చివేశారు. నిర్మాణ దశలో శ్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉన్న భవనం పిల్లర్లను కూల్చివేశారు భవనాన్ని భారీ బందోబస్తు నడుమ ప్రొక్లేయినర్ల సహాయంతో కూల్చివేశారు.దీంతో వైఎస్సార్సీపీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఏపీలో విధ్వంస పాలన మొదలైందని..కక్ష సాధింపు చర్యలకు తెర లేపారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
నిజమే వైసీపీ నేతల ఆరోపణలలో నిజమైన ఆవేదన ఉంది. కాకపోతే ఇక్కడే ఈ నేతలంతా ఒక విషయాన్ని మరిచిపోతున్నారంటూ కూటమి నేతలు అంటున్నారు. అంతవరకూ వైనాట్ 175 అంటూ కాలర్ ఎగరేసుకుని తిరిగిన నేతలకు 11 సీట్లను కట్టబెట్టారు. ఇదే విజయాన్ని కూటమి కాకుండా వైసీపీ సాధిస్తే.. వారంతా ఏ రేంజ్‌లో ఎగిరిపడేవారో అందరికీ తెలుసు. కానీ జనసేన అధినేత నుంచి వచ్చిన తొలిమాట ఏపీ రాజకీయాల్లో ఇక కక్ష సాధింపు చర్యలుండవు.. అభివృద్ధికే పాటుపడతాం అని చెప్పారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అదే మాట అన్నారు. ఒకటి, రెండు ఘటనలు తప్ప ఏపీ అంతా ప్రశాంతంగానే ఉంది.
ఇంకా చెప్పాలంటే తొలిరోజు అసెంబ్లీలో సీన్ రివర్స్ అయి అధికారంలో వైసీపీ నేతలు ఉంటే..రచ్చ రంబోలా చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం అలా ఎక్కడా చేయలేదు . ఎంతో హుందాగా ప్రవర్తిస్తూ జగన్ వాహనాన్ని నిలిపే ప్రదేశం నుంచి జగన్ ప్రమాణ స్వీకారం చేసేవరకూ అన్నిటిలోనూ జగన్‌కు గౌరవమిస్తూనే ఉంది. కాకపోతే అక్రమ కట్టడాలపై మాత్రం కొరడా ఝులిపించడానికి సిద్ధం అవడంతో వైసీపీ సెంట్రల్ పార్టీ ఆఫీసును కూలగొట్టింది. ఎక్కడ ఏం చేయాలో అదే చేస్తుంది తప్ప ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలకు దిగలేదని కూటమి నేతలు చెబుతున్నారు.
మరోవైపు నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేస్తామని సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ ఇదివరకూ వైసీపీ హైకోర్టును కోర్టును ఆశ్రయించింది. ఇదే విషయాన్ని వైఎస్సార్సీపీ న్యాయవాది సీఆర్డీఏ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా కూడా సీఆర్డీయే కూల్చివేతలు చేపట్టింది. దీంతో ఈ విషయాన్ని మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY