ఏపీ: జూలై 8, 9 తేదీల్లో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ, గుంటూరులో భారీ ఏర్పాట్లు

YSRCP Plenary to be Held on July 8 9 at Guntur Leaders Monitoring Arrangements, YSRCP Plenary to be Held on July 8 And 9 at Guntur, YSRCP Leaders Monitoring Arrangements, YSRCP Plenary to be Held at Guntur, Guntur YSRCP Plenary, YSRCP Plenary, Guntur YSRCP Leaders Monitoring Arrangements, ALL Arrangements in full swing for YSRCP plenary at Guntur, YSRCP plenary at Guntur, YSR Congress Party, YSRCP plenary at Guntur News, YSRCP plenary at Guntur Latest News, YSRCP plenary at Guntur Latest Updates, YSRCP plenary at Guntur Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైఎస్సార్సీపీ పండుగకు సిద్ధమవుతోంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరులో ఆ పార్టీ రాష్ట్ర ప్లీనరీ నిర్వహించనుంది. ఈ మేరకు గుంటూరు-విజయవాడ మధ్యనున్న ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా ఉన్న ఓపెన్ సైట్‌లో ప్లీనరీ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలిసారి ప్లీనరీ నిర్వహించనుండటం విశేషం. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా మహమ్మారి కారణంగా మొదటి రెండు సంవత్సరాలు ప్లీనరీ నిర్వహించలేకపోయిన విషయం తెలిసిందే. చివరిసారిగా సెప్టెంబర్ 2017లో నిర్వహించబడింది.

ఈ నేపథ్యంలో ప్లీనరీని విజయవంతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు పార్టీశ్రేణులకు నాయకులు పిలుపునిచ్చారు. క్రిందిస్థాయి కార్యకర్తల నుంచి సీనియర్‌ నేతల వరకు పాల్గొననున్నారు. దాదాపు ఐదు లక్షల మంది హాజరవ్వొచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే విశాలమైన వేదికను నిర్మించారు. వర్షాల నేపథ్యంలో దీనిని రెయిన్‌ప్రూఫ్ జర్మన్ హ్యాంగర్లతో నిర్మిస్తున్నారు. అలాగే మీడియా కోసం ఎయిర్ కండిషన్డ్ టెంట్ మరియు ఆహారాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేక టెంట్‌తో వేదిక వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశాన్ని ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుకలలో జూలై 9 మధ్యాహ్నం సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రసంగం చేయనున్నారు. ప్లీనరీ సందర్భంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలకు సవివరమైన రోడ్‌మ్యాప్‌ను సూచించనున్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ విజయసాయి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 4 =