తాజాగా ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెబుతోంది. పెట్రోల్ బంకులు, స్మార్ట్ మార్కెట్లు, స్వయం ఉపాధి కల్పిస్తూ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. దీనిలో భాగంగా 25 జిల్లాలలో త్వరలో మహిళల పెట్రోల్ బంకులు ప్రారంభం కానున్నాయి. ఇవి మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే ఈ పెట్రోల్ బంకులు కూడా నడిచేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ఏపీలో మొట్టమొదటిసారిగా 25 జిల్లాలలో మహిళల కోసం ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఎదగడం మరియు వ్యాపారంలో విజయవంతం కావడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల ఆర్థిక స్వాతంత్య్రాన్ని లక్ష్యంగా పెట్టుకొని.. పెట్రోల్ బంకులను మహిళల చేతిలో పెట్టడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయంతో డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి పొందడంతో పాటు వ్యాపారంలో స్థిరపడడంతో పాటు తమ కుటుంబాలను కూడా ఆర్థికంగా బలపరచడం కోసం కూటమి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది.
అంతేకాకుండా పెట్రోల్ బంకుల స్థలాల కోసం కూడా అనేక విధాలుగా ప్రభుత్వం సహాయం చేస్తుంది. దీనిలో భాగంగా డ్వాక్రా మహిళలకు లక్ష రూపాయల సహాయం అందించనుంది. ఈ లక్ష రూపాయలతో పాటు మెప్మా స్వయం సహాయక సంఘాలకు 6 వేలకోట్ల రూపాయల పొదుపు డబ్బులను ఉపయోగించి మహిళల వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేయనుంది. ఇది మహిళలకు స్వయం ఉపాధి కలిగించడం కోసం సహకారం అందించేలా తయారైన ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అద్దె వాహనాలు అందించడానికి ర్యాపిడో సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తుంది.
డ్వాక్రా మహిళలు అద్దెకు వాహనాలను తీసుకొని తమ సొంత ఆర్థిక అవసరాలకు ఉపయోగించుకోవచ్చని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. వీటితోపాటు ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహనాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ..డ్వాక్రా మహిళల కోసం ప్రారంభించారు. అలాగే డ్వాక్రా మహిళలకు మరొక ఉపాధి అవకాశంగా నగరాలలో స్మార్ట్ స్ట్రీట్ వెల్డింగ్ మార్కెట్లను కూడా అతి త్వరలో ప్రారంభించబోతున్నారు. రానున్న రోజుల్లో ఏపీలోని మహిళలకు వ్యాపారంలో స్థిరపడడానికి ,వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఈ మార్కెట్లో ఎంతగానో సహాయపడనున్నాయి.