విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థలో టీచర్ల పాత్ర అమూల్యమని ప్రశంసిస్తూ, వారి మీద భారాన్ని తగ్గిస్తేనే పాఠాలను సమర్థవంతంగా బోధించగలరని పేర్కొన్నారు.
విద్యార్థుల కోసం కీలక నిర్ణయాలు:
బ్యాగ్ బరువు తగ్గించేలా సంస్కరణలు అమలు
నాణ్యమైన యూనిఫామ్ పంపిణీ
విద్యా రంగ పురోభివృద్ధికి అన్ని వర్గాల సమిష్టి సహకారం అవసరం
విద్యా రంగంలో మార్పులు:
గత ప్రభుత్వం ఐబీ స్కూళ్ల ఏర్పాటుపై ప్రగల్భాలు పలికిందని, నివేదిక తెప్పించేందుకు రూ.5 కోట్లు ఖర్చు చేసిందని లోకేశ్ విమర్శించారు. తాను “వన్ క్లాస్ – వన్ టీచర్” విధానాన్ని బలంగా విశ్వసిస్తున్నానని, ప్రస్తుతం కేవలం 1,400 పాఠశాలల్లో అమలవుతున్న ఈ విధానాన్ని 10,000 స్కూళ్లకు విస్తరించనున్నట్లు తెలిపారు.
టీచర్ల బదిలీలపై కీలక నిర్ణయం:
ప్రభుత్వం జీవో నెం.117ను రద్దు చేసి కొత్త జీవో తీసుకురానుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై చర్చిస్తూ, గతంలో నోటిఫికేషన్ విడుదల చేస్తే కేసులు వస్తుండడంతో సమస్య తలెత్తిందన్నారు. అందుకే, అన్ని లోటుపాట్లను సవరించి, అభ్యంతరాలను నివారించి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు.
టీచర్లకు శుభవార్త:
ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను ఆన్‌లైన్‌లో ఉంచి, మార్చి 7వ తేదీలోగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనుంది. అన్నీ అనుకూలిస్తే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.