కోదండ రాముని కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధం

ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు సిద్దం చేసింది. రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది టీటీడీ. కన్నుల విందుగా పండు వెన్నెలలో కళ్యాణం జరగడం ఇక్కడ అనవాయితీ.ఏపీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా వస్తుండటంతో.. ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు.

కడప జిల్లాలోని ఒంటిమిట్ట ఆలయంలో సీతా,రామ,లక్ష్మణ విగ్రహాలు ఓకే శిలతో ఉండటం వల్ల ఓంటిమిట్టను ఏకశిలానగరమని పిలుస్తారు. త్రేతాయుగంలో ఆలయంలోని మూలవిరాట్టు విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్టించాడని చరిత్రకారులు చెబుతారు. దేశంలో ఏక్కడాలేని విధంగా ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవిని ఓకే శిలపై చెక్కారు. ఈ ఆలయంలో ఆంజనేయుడు ఉండకపోవడం కూడా ప్రత్యేకత. అంటే రామాంజేయులు కలయికకు ముందే ఈ ఆలయం నిర్మాణం జరిగినట్లు పురాణాలు చెబుతాయి.

రెండో అయ్యోధ్య గా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్యాణోత్సవం ను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. కల్యాణోత్సవం సందర్భంగా ఓంటిమిట్టలో ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాములవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఓవైపు శాశ్వత అభివృధ్ది పనులు, మరోవైపు నవమి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. గత ఏడాది ఉత్సవాలకు మూడులక్షల మంది భక్తులు రాములవారి కళ్యాణోత్సవానికి హాజరయ్యారు. ఈ ఏడాది ఐదు లక్షలమంది భక్తులు హాజరయ్యే అవకాశమయ్యే అవకాశాలుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి పర్యటన కూడా ఉండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఏకశిలా నగరం కల్యాణోత్సవానికి సిద్ధమవుతోంది. కోదండ రాముడి కళ్యాణం పౌర్ణమి రోజు పండు వెన్నెలలో జరగనుంది. ఆంజనేయుడు లేని ఏకైక రామాలయంగా ప్రసిద్ధిగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో కల్యాణోత్సవ ఘట్టం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వామి వారి కళ్యాణం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 గంటల మధ్య జరగనుంది. ప్రభుత్వం తరఫున స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 6 గంటల కు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.. ప్రతియేట కల్యాణోత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతూ ఉంటారు. అలాగే ఈ ఏడాది మరింత ఎక్కువ స్థాయిలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో.. కళ్యాణోత్సవం తిలకించడం కోసం 47 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ముత్యాల తలంబ్రాలు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులతో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.