ఏపీ రాజకీయాలను షేక్‌ చేస్తున్న ఫేక్‌ ప్రచారం

AP State elections , Fake campaign shaking AP politics , YCP vs TDPA
AP State elections , Fake campaign shaking AP politics , YCP vs TDPA

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరి డప్పు వారే కొట్టుకోవాలి. అది మాత్రమే సరిపోదు. ప్రత్యర్థిని తిట్టాలి. లోపాలను ఎత్తిచూపాలి.. ఈ విషయం అందరికీ తెలిసిందే. అన్ని పార్టీలూ అదే చేస్తాయి. వీటితో పాటు ఇటీవలి కాలంలో ఫేక్‌ ప్రచారాలు పెరుగుతున్నాయి. సోషల్‌మీడియా వినియోగం విస్తృతం అయిన తర్వాత ఎన్నికల వేళ కొత్త ధోరణి కనిపిస్తోంది. ప్రత్యర్థిని చిత్తు చేయడానికి, ప్రత్యర్థి పార్టీని డైలమాలో పడేయడానికి రూమర్లను, తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారు. అసలు వార్తలు కంటే.. ఆ తరహా ప్రచారాలే ఎక్కువగా వైరల్‌ అవుతూ సంచలనంగా మారుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఇప్పుడు ఇదే ఎక్కువగా జరుగుతోంది. ఫేక్‌ ప్రచారం చాలామందిని షేక్‌ చేస్తోంది. ‘నా మాటలను  వక్రీకరించారు. ఆ స్టేట్‌మెంట్‌ నాది కాదు. అది తప్పుడు వార్త’ అంటూ ఆయా నేతలు బదులిచ్చుకోవాల్సి వస్తోంది. ఫేక్‌ ప్రచారాలపై చంద్రబాబు మాట్లాడుతూ ఐ-ప్యాక్‌ టీం పోగు చేసి తెచ్చిన వారి పక్కన జగన్‌ కూర్చుని వల్లమాలిన ఆప్యాయత వలకబోస్తూ ఫొటోలు దిగి ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇది చాలడం లేదని ప్రతి రోజూ ఫేక్‌ ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అందుకు కొన్ని ఉదాహరణలు పేర్కొంటూ.. ‘పొత్తు తాత్కాలికమేనని నేను అన్నట్లు నా పేరు మీద ఒక రోజు.. బీజేపీ పదవికి రాజీనామా చేస్తున్నానని పురందేశ్వరి చెప్పారని ఒక రోజు… ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆమె చెప్పారని ఇంకో రోజు తప్పుడు ప్రకటనలు ప్రచారంలో పెడుతున్నారు. ప్రజలపై నమ్మకం లేక ఫేక్‌ ప్రచారాలతో బతికే ప్రయత్నం చేస్తున్నారు’ అని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ విశృంఖలంగా జరుగుతోందన్నారు. ప్రతివారి ఫోన్లూ ట్యాపింగ్‌ పరిధిలో ఉన్నాయనితెలిపారు.

అలాగే.. వైసీపీకి కూడా ఫేక్‌ ప్రచారాల తాకిడి పెరుగుతోంది. కూటమి స్పీడుకు తట్టుకోలేక చాలాచోట్ల అభ్యర్థులను మారుస్తోందని, సీటు మార్పు విషయంలో అన్నాదమ్ముల మధ్య మనస్పర్థలు.. ఇలా రకరకాల అంశాలు వైరల్‌ అవుతున్నాయి. మొత్తంగా ఈ ఫేక్‌ ప్రచారాలు ఏపీ రాజకీయాలను షేక్‌ చేస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE