ఇదే చాన్స్‌ అంటున్న చంద్రబాబు

Chandrababu Says This Is The Chance,AP State Elections,Chandrababu,TDP vs YCP,CM Jagan,Telugu News,AP State Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,TDP,Janasena,YSRCP,Chandrababu Naidu,Pawan Kalyan,Chandrababu News,Chandrababu Speech,Chandrababu News,Chandrababu Latest News,Chandrababu Pressmeet

చంద్రబాబుకు రాజయోగం ఉందని ఉగాది పూట పండితులు జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 128 అసెంబ్లీ సీట్లు, 24 ఎంపీ సీట్లు దక్కుతాయని పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిషుడు మాచిరాజు వేణుగోపాల్‌ పంచాంగ శ్రవణం వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రాబోయేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇవన్నీ టీడీపీ అధినేత చంద్రబాబులో ఉత్సాహం నింపుతున్నాయి. ప్రచారంలో, మరిన్ని హామీలు ఇవ్వడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికి చూసింది టీజర్‌ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని చెబుతున్నారు.

ఇదేపనిలో రాష్ట్ర ఎన్నికల్లో కీలకమైన వాలంటీర్లను కూడా ఆకర్షించేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. తమ కూటమి అధికారంలోకి వచ్చాక వలంటీర్లకు ఇప్పుడు ఇస్తున్న రూ.5 వేల పారితోషికాన్ని రూ.10 వేలకు పెంచుతామని ఇటీవల ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రజలు సంకల్పం తీసుకోవాలని పిలుపు ఇస్తున్నారు. అందులో వాలంటీర్లు కూడా భాగస్వామ్యం కావాలని చెబుతున్నారు.

గతానికి భిన్నంగా చంద్రబాబునాయుడి ప్రచారం ఉండడం ఆసక్తిని రేపుతోంది. ఎన్నికల ముందు వరకూ వాలంటీర్లపై ఆరోపణలు చేసిన టీడీపీ అండ్‌ టీం.. ఇప్పుడు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.  అలాగే పింఛన్ల పంపిణీ ఆలస్యానికి టీడీపీ చేసిన ఫిర్యాదులే కారణం అన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఇప్పటికే శ్రేణులకు బాబు పిలుపునిచ్చారు. పరిస్థితులు అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని, గెలిచేందుకు ఇదే చాన్స్‌ అని అభ్యర్థులకు ఉత్సాహాన్ని నూరుపోస్తున్నారు. మరోవైపు జగన్‌ చేపడుతున్న మేమంతా సిద్ధంపై ఇప్పుడు ఎక్కువగా ఫోకస్‌ చేశారు. ఆ యాత్ర ఎలా సాగుతోంది.., స్పందన ఎలా ఉంది.. ఏయే అంశాలపై ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు.. తెలుసుకుంటూ ఆయా అంశాల్లోని లోపాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

తమ పరిస్థితి బాగుందని చెప్పుకోవడానికి చరిత్రలో లేని విధంగా 1500 బస్సులు పెట్టి జగన్‌ సభలు జరుపుతున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ‘ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? వ్యవసాయం చేస్తున్నారా… వ్యాపారం చేస్తున్నారా? ఒక్కో సభకు కనీసం రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటివి కనీసం పది సభలు పెట్టారు. అప్పటికీ జనం రాక ఒక మీటింగ్‌ ఫొటోలను మరో మీటింగ్‌కు మార్ఫింగ్‌ చేసి వాడుతున్నారు’ అంటూ ఇటీవల ఓ సభలో జగన్‌ను బాబు దుయ్యబట్టారు. పరిస్థితులు కూటమికి అనుకూలంగా ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో ప్రచారంలో వాడి వేడి పెంచుతున్నారు. అలాగే.. మరింత కష్టపడితే విజయం సాధించవచ్చనే ధీమాతో ఏడు పదుల వయసులోనూ మండుటెండను సైతం లెక్కచేయకుండా చంద్రబాబు ప్రచారం సాగిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =