ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయిన విషయం తెలిసిందే. వై నాట్ 175 అంటూ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసినప్పటికీ ఆ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమయింది. ఊహించని రీతిలో ఓడిపోయింది. ఓటమితో జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రకరకాల ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి. ఆ పార్టీ తరుపున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వైసీపీని జగన్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.
అయితే ఒకప్పుడు సోనియా గాంధీని ఎదురించే సొంత పార్టీ పెట్టిన జగన్.. ఇప్పుడు ఆ పార్టీలో ఎందుకు విలీనం చేస్తారని కొందరు వాదిస్తున్నారు. జగన్ వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయరంటే చేయరని అంటున్నారు. మరికొందరు మాత్రం రాజకీయాల్లో ఏది ఎప్పుడైనా జరగొచ్చని చెబుతున్నారు. ఈక్రమంలో సోషల్ మీడియాలో కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం వార్తలు తెగ వైరలవుతున్నాయి. ఇన్ని రోజులు ఈ వార్తలపై వైసీపీ సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. తాజాగా ఆ పార్టీకి చెందిన కీలక నేత స్పందించారు. కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమంటూ జరుగుతున్న ప్రచారంపై స్పష్టతను ఇచ్చారు.
అవును.. వైసీపీకి సంబంధించి జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. తమ పార్టీకి సంబంధించి జరుగుతున్న ప్రచారంపై మండిపడ్డారు. సోనియా గాంధీనే ఎదిరించి వచ్చిన జగన్ మళ్లీ ఆ పార్టీతో ఎందుకు చేతులు కలుపుతారని ప్రశ్నించారు. జగన్‌ను జైలుకు పదహారు నెలలు పంపిస్తేనే ఆయన లొంగలేదని.. ఇప్పుడు ఓటమి ఎదురయినంత మాత్రాన తగ్గిపోతాడు అనుకుంటే పొరపాటేనని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని వైసీపీలో విలీనం చేసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాడుతారని పేర్ని నాని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE