కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కొలువు దీరబోతోంది. ఈనెల 9న ప్రధాన మంత్రిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈసారి మోడీ కేబినెట్‌లో ఏపీ నుంచి నలుగురు ఎంపీలకు చోటు దక్కబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎన్డీయే పెద్దలతో చర్చించారని.. నలుగురికి బెర్తులు కన్ఫామ్ అయ్యాయయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు నలుగురి పేర్లు కూడా వైరలవుతున్నాయి.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు నుంచి టీడీపీ తరుపున పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేసి మూడు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికలకంటే ముందు తన అఫిడవిట్‌లో వేల కోట్ల రూపాయల ఆస్తులను చూపించి పెమ్మసాని సంచలనం సృష్టించారు. అలాగే చంద్రశేఖర్ అమెరికాలో దిగ్గజ వ్యాపారవేత్త. ఈక్రమంలో కేంద్ర కేబినెట్‌లో ఆయనకు అవకాశం కల్పిస్తే ఏపీకి భారీ ఎత్తున పరిశ్రమలను తీసుకొస్తారని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. అందుకే కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కే వారిలో పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
శ్రీకాకుళం నుంచి పోటీ చేసి మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కూడా మోడీ కేబినెట్‌లో బెర్త్ కన్ఫాఫ్ అయిందట. గతంలో ఆయన తండ్రి చూసిన గ్రామీణాభివృద్ధి శాఖను రామ్మోహన్ నాయుడుకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నుంచి పోటీ చేసి గెలుపొందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కూడా కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కనుందట. గతంలో వేమిరెడ్డి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఈక్రమంలో ఆయనకు సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే బీసీలలో వాల్మిక సామాజిక వర్గానికి చెందిన నేత, అనంతపురం నుంచి ఎంపీగా గెలుపొందిన అంబికా లక్ష్మి నారాయణను కూడా కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కనుందట. ఈ నలుగురికి మోడీ కేబినెట్‌లో చోటు దక్కేలా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారట. మరి చూడాలి వీరిలో ఎవరెవరిని కేంద్ర మంత్రి పదవి వరిస్తుందో..
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY