
ఏపీ, తెలంగాణలోని విద్యా సంస్థలకు ప్రభుత్వాలు బుధవారం అంటే ఈరోజు సెలవు ప్రకటించాయి. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే ముఖ్యమైన పండగల్లో ఒకటైన మొహర్రం సందర్భంగా ఈ సెలవును ప్రకటించారు. ముస్లింలు రంజాన్, బక్రీద్ తర్వాత మొహర్రంనే ప్రముఖంగా జరుపుకుంటారు. దీనిని పీర్ల పండగ అని కూడా అంటారు. ఈ సందర్భంగా.. ఏపీ, తెలంగాణలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ.. ఆయా విద్యాశాఖల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే జులై 17 న తొలి ఏకాదశి కూడా ఉంది. హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగల్లో తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి- లక్ష్మీదేవిలను ఆరాధిస్తారు.
దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాలకు అతి భారీవర్షాల ముప్పుంది. ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆగ్నేయ- పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు.. షియర్ జోన్ ఏర్పడటంతో.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలలో ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో జులై 18, 19 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గోవా, కర్ణాటక, కేరళలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాల ముప్పుంది. అక్కడ కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాల్లో అధికారులు మూడ్రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఒకవేళ ఏపీ, తెలంగాణలో ఇదే పరిస్థితి కనిపిస్తే..ఇక్కడ కూడా ఈ సెలవులను పొడిగించే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగా ఈ ప్రభావం పెద్దగా లేకపోతే..కేవలం జులై 17న మాత్రమే సెలవు అవుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE