
రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను కలుపుతూ ప్రజెంట్ ఉన్న ఆరు లైన్ల నేషనల్ హైవేని ఎనిమిది లైన్లుగా మార్చి.. గ్రీన్‌ఫీల్డ్ హైవేగా తీర్చిదిద్దడానికి ఏపీ సీఎం చంద్రబాబు,, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏకాభిప్రాయానికి వచ్చారు. త్వరలోనే ఈ ప్రతిపాదనను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి దృష్టికి తేనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఈ రోడ్డు విస్తరణ చేస్తే..ప్రజల రాకపోకలకు మాత్రమే కాకుండా సరుకు రవాణాకు కూడా ఉపయోగపడుతుందని రెండు రాష్ట్రాల సీఎంల అభిప్రాయం.
రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య రహదారి కనెక్టివిటీని పెంపొందించే అంశాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రోడ్డు కనెక్టివిటీ గతంలో కంటే మెరుగుపడినా ఇప్పుడు అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు ఈ రోడ్డు కనెక్టివిటీని పొడిగించాలనేది రెండు రాష్ట్రాల సీఎంల ప్రతిపాదనగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 6 లైన్లను 8 లైన్లకు విస్తరించడానికి అవసరమైన భూసేకరణ విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటాయి. నిజానికి తెలంగాణలో సరుకు రవాణా కోసం ఒక డ్రైపోర్టు నిర్మించాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఒకవేళ ఇప్పుడు అనుకున్న ప్రతిపాదన కార్యరూపం దాల్చి వినియోగంలోకి వస్తే మాత్రం..ఇది ఇతర రాష్ట్రాలు, దేశాలకు మచిలీపట్నం రేవు ద్వారానే సరుకు రవాణా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.
ఈ మౌలిక సదుపాయంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని ఇద్దరు ముఖ్యమంత్రుల అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ప్రజాభవన్‌లో ఈ అంశం గురించి ప్రస్తావించిన ఇద్దరు ముఖ్యమంత్రులు లోతుగా చర్చించి ఏకాభిప్రాయాన్ని వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం.రీసెంటుగా ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలిశారు. తెలంగాణలో కొత్త జాతీయ రహదారులను మంజూరు చేయడంతో పాటు కొన్ని రాష్ట్ర రహదారులనూ జాతీయ రహదారులుగా గుర్తించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.
హై స్పీడ్ రోడ్ కనెక్టివిటీ ప్రతిపాదనను త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల తరఫున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముందుకు వెళ్లనున్నాయి. హైదరాబాద్, అమరావతి మధ్య 8 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే ప్రతిపాదనకు కేంద్రం ఓకే చెబితే.. సరుకు రవాణాకు మార్గం సుగమమవుతుందని, ఎగుమతులు పెరుగుతాయని, రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE