ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. జనవరి 7న తొలిసారిగా హైపవర్ కమిటీ సమావేశమయ్యి, నివేదికలపై సుదీర్ఘంగా చర్చలు జరిపి అభివృద్ధి వికేంద్రీకరణతోపాటు పాలనా వికేంద్రీకరణ కూడా జరగాలని అభిప్రాయపడింది. ఈ క్రమంలో జనవరి 10, శుక్రవారం ఉదయం 10 గంటలకు హైపవర్ కమిటీ మరోసారి భేటీ కాబోతున్నట్లు తెలుస్తుంది. రెండో సమావేశంలో రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు సమస్యలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. రాజధాని ప్రాంత రైతుల్ని సంతృప్తి పరిచేలా వారి ముందుకు కొన్ని ప్రతిపాదనలు తెచ్చే విషయాన్ని హైపవర్ కమిటీ పరిశీలించనుంది. రాజధాని అంశంతో పాటుగా నివేదికల్లో సమర్పించిన జిల్లాలు, ప్రాంతాల వారీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై హైపవర్ కమిటీ చర్చించనుంది.
హైపవర్ కమిటీ సభ్యులు:
- ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
- ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
- హోంమంత్రి మేకతోటి సుచరిత
- మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
- పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి
- విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్
- పౌర సరఫరాల శాఖమంత్రి కొడాలి నాని
- వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
- రవాణా శాఖ మంత్రి పేర్ని నాని
- మార్కెటింగ్ శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని
- ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం
- ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
- సీసీఎల్ఏ
- పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి
- న్యాయ శాఖ కార్యదర్శి
[subscribe]














































