ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం.. సెకండ్ ఇయర్ ఫిజిక్స్‌లో తప్పు ప్రశ్నకు 2 మార్కులు కేటాయింపు

AP Board of Intermediate Announces 2 Marks will be Added For Wrong Question in Second Year Physics Exam,AP Board of Intermediate,Intermediate 2 Marks will be Added,Wrong Question in Second Year Physics Exam,AP Board Intermediate Wrong Question,Marks will be Added in Second Year Physics Exam,Mango News,Mango News Telugu,AP Inter Exams,AP Inter Exams 2023,AP Intermediate Exams 2023,AP Board Inter 2nd Year Physics,Andhra Pradesh Board Class 12 Exam 2023,AP Inter Exams Latest News,AP Inter Exams Latest Updates

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ద్వితీయ సంవత్సరం భౌతికశాస్త్రం పరీక్షలో తప్పు దొర్లిన ప్రశ్నకు సంబంధించి ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు 2 మార్కులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రశ్నపత్రంలోని మూడో ప్రశ్నకు విద్యార్థులు జవాబు రాసినా.. రాయకపోయినా 2 మార్కులు కలపనున్నట్లు సోమవారం పేర్కొంది. కాగా ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా సోమవారం సెకండ్ ఇయర్ ఫిజిక్స్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రంలో సరిగానే ప్రచురితమైన ప్రశ్న.. ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రంలో మాత్రం తప్పుగా వచ్చింది. తెలుగు ప్రశ్నపత్రంలో ‘అయస్కాంత ప్రవణత (అవపాతము)ను నిర్వచించుము’ అని ఉన్న ప్రశ్న.. ఆంగ్ల మాధ్యమంలో ‘డిఫైన్ మాగ్నటిక్ డెక్లినేషన్’ అని వచ్చింది. అయితే ఇది.. ‘డిఫైన్ మాగ్నటిక్ ఇంక్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్’ అని రావాల్సి ఉంది. దీంతో తికమక పడిన ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు కొందరు జవాబు రాయగా.. మరికొందరు అర్ధం కాక వదిలేశారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్ బోర్డు ఆ ప్రశ్నకు 2 మార్కులు కలుపుతున్నట్లు ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =