టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్‌ రెడ్డి

IAS Officer KS Jawahar Reddy Takes Charge as TTD New EO

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఈవోగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కేఎస్‌ జవహర్‌ రెడ్డిని ఏపీ ప్రభుత్వం ఇటీవలే నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10, శనివారం నాడు టీటీడీ ఈవోగా జవహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శనివారం ఉదయం ఆయన అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి చేరుకున్నారు. ఆలయంలోకి చేరుకుని కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేదపండితులు జవహర్‌రెడ్డిని ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. తదుపరిగా అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఉన్నతాధికారులతో జవహర్ రెడ్డి సమావేశం నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu