గుంతకల్లువాసులు ఈ సారి ఏ పార్టీని గెలిపిస్తారు?

Doubt On Gummanur Jayaram Victory In Assembly Elections, Doubt On Gummanur Jayaram Victory, Gummanur Jayaram Victory, Assembly Elections Doubt On Jayaram Victory, Gummanuri Jayaram, Guntakallu,Venkatrami Reddy, Kavali Prabhakar,YCP, TDP, AP Assembly Elections, Lok Sabha Elections, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Gummanuri Jayaram, Guntakallu,Venkatrami Reddy, Kavali Prabhakar,YCP, TDP, AP Assembly Elections,

ఐదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన గుమ్మనూరి జయరాంకు ఈ సారి మాత్రం గెలుపు అంత ఈజీగా లేదన్న ప్రచారం జరుగుతోంది. బోయ సామాజికవర్గానికి చెందిన గుమ్మనూరి జయరాం గురించి పేకాట క్లబ్‌ల నిర్వహణ వంటి ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే.. సీఎం జగన్ మాత్రం తన కేబినెట్‌లోనే కొనసాగించారు. ఆయన కుటుంబ సభ్యులపైన కూడా చాలా ఆరోపణలు వినిపించాయి. అయితే ఈ ఎన్నికల్లో ఆలూరు నుంచి కాకుండా గుమ్మనూరిని కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయాలని జగన్ చెప్పడంతో మనస్తాపానికి గురై తెలుగు దేశం పార్టీ చేరిపోయారు.

ఆర్థికంగానూ, సామాజికంగానూ బలమైన నేత కావడంతో గుమ్మనూరి జయరాంను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. కానీ ఆయన కోరుకున్నట్లు ఆలూరు టిక్కెట్ ఇవ్వకుండా గుంతకల్లులో పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. గుంతకల్లు నుంచి పోటీ చేయడం ఇష్టం లేకపోయినా అసెంబ్లీలో కాలుమోపాలన్న ఆశతో జయరాం అక్కడి నుంచి బరిలోకి దిగారు. కానీ గుమ్మనూరి జయరాంకు టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీలోని ఆశావహులు వ్యతిరేకించారు. తాము గుమ్మనూరికి మద్దతు ఇవ్వబోమని చెప్పేయడంతో.. చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. అయినా వారెవ్వరూ కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదు.

నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా 2009లో గుంతకల్లు నియోజకవర్గం ఏర్పడింది. 2009లో అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన మధుసూదన్ గుప్తా విజయాన్ని సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్ధిగా జితేందర్ గౌడ్ విజయం సాధించారు. కానీ అదే జితేందర్ గౌడ్ 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వెంకట్రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి టిక్కెట్ రాకపోవడంతో జితేందర్ గౌడ్ వర్గం గుమ్మనూరికి మద్దతు ఇవ్వడానికి నో అంటుంది.

అయితే గుంతకల్లు నియోజకవర్గం ఏర్పడ్డాక.. జరిగిన మూడు ఎన్నికల్లోనూ మూడు సార్లు మూడు పార్టీలు గెలిచాయి. దీంతో తాను కొత్త వ్యక్తి కాబట్టి ఇక్కడి ప్రజలు తనను ఆదరిస్తారన్న ధీమాతో గుమ్మనూరి జయరాం ఉన్నారు.అటు వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి టిక్కెట్ ఇవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా కావలి ప్రభాకర్ పోటీలో ఉండనున్నారు. దీంతో గుమ్మునూరి విజయం అంత ఈజీ కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 6 =