ఎన్నికల ముందు.. ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణం. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు కొత్త ప్రభుత్వంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. వారిని వారు కాపాడుకునేందుకు ఇలా చేస్తుంటారు. అలాగే తమ బలాన్ని మరింత పెంచుకునేందుకు అధికార పార్టీలు.. ప్రతిపక్ష పార్టీల నేతలకు వల వేస్తుంటాయి. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో తెలుగు దేశం-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా.. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అధికార పక్షం నుంచి ఎలాగైనా ఒత్తిళ్లు తప్పవని భావించిన ప్రతిపక్ష నేతలు అధికార పక్షంలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు కాషాయపు గూటికి వెళ్లేందుకు సిద్ధయ్యారని.. బీజేపీ హైకమాండ్‌తో కూడా మంతనాలు జరిపారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సాధారణంగా చిన్న లీడర్లు చేరడాన్ని పెద్దగా హైకమాండ్ పట్టించుకోదు. కానీ బడా లీడర్లు చేరుతున్నప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తుంటుంది. ఇప్పుడు బీజేపీ కూడా ప్రతిపక్ష నేతలను తమ వైపు తీసుకునే విషయంలో వెనకా ముందు తీసుకొని నిర్ణయాలు తీసుకుంటోంది. పైగా కూటమిలో భాగస్వామిగా ఉండడంతో.. గతంలో మాదిరిగా ఇష్టారాజ్యంగా జాయిన్ చేసుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. కొత్తగా పార్టీలో జాయిన్ చేసుకునే వారిని ఇకపై స్క్రూట్నీ చేయనుంది. ఆ తర్వాతే వారిని పార్టీలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
గతంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో ఉండి.. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిన వారు.. వైసీపీ నుంచి కూటమిలోకి వచ్చే వారి విషయంలో బీజేపీ ఇక నుంచి ఆచి తూచి వ్యవహరించనుంది. గతంలో వీరు ఏం చేశారు? అవినీతికి పాల్పడ్డారా? వారిపై ఉన్న ఆరోపణలు ఏంటి? ఎందుకు పార్టీ మారాలనుకున్నారు? వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే వారిని పార్టీలోకి తీసుకోవాలా? వద్దా? అన్న దానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకోనుందట. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒత్తిళ్ల నుంచి తట్టుకోలేక పార్టీ మారే వారిని ఎట్టి పరిస్థితిలోనూ జాయిన్ చేసుకోవద్దని బీజేపీ పెద్దలు నిర్ణయించారట. అటువంటి వారిని తీసుకోవడం ద్వారా కూటమిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హైకమాండ్ ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీలో చేరికలకు సంబంధించి త్వరలో కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారట. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF