ఏపీలో వినుకొండ హత్య ఘటన కొద్దిరోజులుగా కాక రేపుతోంది. నడిరోడ్డుపై రషీద్ అనే వ్యక్తిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన జరిగిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకపు పాలన కొనసాగుతోందని.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా స్వయంగా వినుకొండకు వెళ్లారు. రిషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే సమయంలో సంచలన ప్రకటన చేశారు. ఈ ఘటనపై ఢిల్లీలో ధర్నాకు పిలుపు నిచ్చారు. వినుకొండ ఘటను జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లేందుకు జూలై 24న ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు.
అయితే వినుకొండలో రషీద్ హత్య జూలై 17న జరిగింది. కానీ మధ్యంలో వారం గ్యాప్ ఇచ్చి జూలై 24న ఢిల్లీలో ధర్నా చేసేందుకు జగన్ సిద్ధమయ్యారు. మరి ధర్నా చేసేందుకు జగన్ వార్ రోజులు గ్యాప్ ఎందుకు ఇచ్చారు?.. అలాగే 24వ తేదీనే ఎందుకు ఎంచుకున్నారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ధర్నా కోసం జగన్ 24వ తేదీని ఎంపిక చేసుకోవడం వెనుక భారీ వ్యూహమే ఉందని విశ్లేషకులు అంటున్నారు. 23వ తేదీని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మధ్యలో ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి 25వ తేదీని ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. మధ్యలో ఉన్న ఆ ఒక్కరోజును జగన్ ధర్నా కోసం ఎంపిక చేసుకున్నారు. ఏపీ స్టేట్ బడ్జెట్‌పై చర్చను పక్కదారి పట్టించేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సహజంగా ఢిల్లీలో ఓ మాజీ ముఖ్యమంత్రి ధర్నా చేస్తున్నారంటే అతి పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. అన్ని మీడియా సంస్థలు ఆ వార్తను కవర్ చేస్తాయి. దేశవ్యాప్తంగా దీనిపై అందరూ చర్చించుకుంటారు. ఇలా చేయడం ద్వారా ఆ మరునాడు బడ్జెట్ అంశం కాకుండా.. జగన్ ధర్నా మరునాడు అన్ని పేపర్లు.. ఛానెల్స్‌లో హెడ్‌లైన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి 24వ తేదీని ఎంపిక చేసుకోవడానికి గల కారణమని విశ్లేషకులు అంటున్నారు. బడ్జెట్ అంశంపై చర్చ జరగకుండా చేయడమే జగన్ వ్యూహమని చెబుతున్నారు. అంతేకాకుండా ఏపీలో వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి కార్యకర్తలు డల్ అయిపోయారు. ఇప్పుడు ఈ ధర్నా ద్వారా తిరిగి కార్యకర్తల్లో ఎంతో కొంత ఊపును తీసుకొచ్చి.. వారిని తిరిగి యాక్టివ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF