సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ రోజున అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లోకి వెళ్లి , ఈవీఎం ను ధ్వంసం చేశారు.పిన్నెళ్లి పోలింగ్ బూత్ లోకి వెళ్లి చేసిన స్వైరవిహారం అందరికి తెలిసిందే. పిన్నెళ్లి ఈవిఎం ని ధ్వంసం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, మీడియాలో కూడా ప్రసారం అయ్యాయి. ఈ కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో ఆయన అరెస్టు చేసి రిమాండ్ కి పంపించారు. నెల్లూరు సెంట్రల్ జైల్ లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వెళ్లారు జగన్. అయితే సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయ్యాయి. పిన్నెల్లిని సమర్థిస్తూ జగన్ మాట్లాడారు. ఈ సమర్థించడం కూడా విచిత్రంగా ఉంది. ఆ పోలింగ్ బూత్ లో ఈవీఎంలను ప్రభావితం చేస్తున్నారన్నట్లు జగన్ మాట్లాడారు. అందుకే పిన్నెల్లి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేశారన్నట్లు కామెంట్స్ చేశారు.
అక్కడ అన్యాయం జరుగుతుండడంతో, ఎమ్మెల్యే లోపలికి వెళ్లి ఈవీఎం పగలగొట్టాడు. వైసీపీకే ఓట్లు పడుతుంటే ఎమ్మెల్యే వెళ్లి ఈవీఎం ను పగలగొట్టాల్సిన అవసరం ఏముంది ? అక్కడికి వెళ్ళినప్పుడు జరుగుతున్న అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు .ఈ కేసులో బెయిల్ కూడా వచ్చింది.ఇవాళ తను లోపల ఉన్నది ఈవీఎం ను పగలగొట్టిన కేసులో కాదు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై అంతటా విమర్శలు వస్తున్నాయి.
ఈవీఎంలను ధ్వంసం చేయడం తప్పే కాదన్నట్లుగా జగన్ మాట్లాడటం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ నిజంగానే ఈవీఎంల ను ఎవరైనా ప్రభావితం చేసినట్లయితే… ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు, ఎన్నికల కమిషన్ కు తెలియజేయవచ్చు. కోర్టుకు, గవర్నర్ కు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కు కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలా చేయలేని పక్షంలో శాంతియుతంగా కూడా నిరసన తెలపవచ్చు. ఇవన్నీ ఏమి చేయకుండా నేను ఎమ్మెల్యే అభ్యర్థిని ఇష్టం వచ్చినట్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటానని ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని ఎవరు కూడా సమర్థించరు. అలాంటిది ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ బహిరంగంగానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వ్యక్తిని సమర్థించడం తో రాజ్యాంగం అంటే లెక్కేలేదా అని విమర్శలు వస్తున్నాయి. రాజ్యాంగంలో ఉన్న రూల్ ఆఫ్ లా ప్రకారం చట్టం అందరికి సమానమే అలాంటింది ఏ ఒక్కరో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం రాజ్యాంగానికి విరుద్దమే… అలాంటి చర్యలను ఎవరు కూడా సమర్థించకూడదు. అక్కడ ఏం జరిగిన ఫిర్యాదు చేసే హక్కు ఎవరికైనా ఉంది. విచారణ చేయడానికి చట్టం కోర్టులు ఉన్నాయి. ఈవీఎంలను పగలగొడితే మా నాయకుడు మద్దతు తెలిపాడని రేపు రేపు మరో కార్యకర్తనో, నాయకుడో మరో చట్ట వ్యతిరేక పనులు చేసే అవకాశముంది. అందుకే ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసిన జగన్ పిన్నెల్లి ని సమర్థించడం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యం కాదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE