తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

AP Governor Biswabhusan Harichandan Visits Tirumala Venkateswara Swamy Temple Today, Governor Biswabhusan Harichandan Visits Tirumala Venkateswara Swamy Temple Today, Biswabhusan Harichandan Visits Tirumala Venkateswara Swamy Temple Today, Tirumala Venkateswara Swamy Temple, AP Governor Biswabhusan Harichandan, Governor Biswabhusan Harichandan, Biswabhusan Harichandan, AP Governor Biswabhusan, AP Governor, Governor Biswabhusan Harichandan Visits Tirumala Tirupati Temple, Tirumala Tirupati Temple, Tirumala Venkateswara Swamy, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం సతీసమేతంగా ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా కలెక్టర్‌ కె. వెంకట రమణా రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. తిరుమల విచ్చేసిన గవర్నర్ దంపతులకు టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికింది. అనంతరం గవర్నర్ దంపతులు ధ్వజస్తంభానికి మొక్కి శ్రీవారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానంతరం గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వారికి పండితులు వేదాశీర్వచనం అందించగా టిటిడి ఈవో తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలు అందజేశారు. కాగా ఈరోజు ఉదయం ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్‌ మిశ్రా కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడటం, కొత్తగా స్కూల్స్ మరియు కాలేజీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొండపై రద్దీ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా స్వామివారి దర్శనం కోసం మొత్తం 27 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, వీరికి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here