ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష లీడర్ హోదా ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సభలో ప్రతిపక్షంలో ఎవరు ఎక్కువ సభ్యులు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఉంటుందని అన్నారు. ఆ పార్టీ నేతకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నారు. అయితే జగన్ తనకు ప్రతిపక్ష హోదా రాదని తెలిసిన ఎందుకు పోరాటం చేస్తున్నాడనేది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి జగన్ కి రాజకీయ ప్రత్యర్థులు, వ్యక్తిగత శత్రువులు వేర్వేరు కాదు. తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఆయన వ్యక్తిగత శత్రువులుగానే చూస్తు వస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆయన వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉంటారు. పార్టీ బలం ప్రకారం మాట్లాడే అవకాశం వస్తుంది. కానీ ప్రతిపక్ష నేత హోదా మాత్రం రాదు. కోర్టులకు వెళ్లినా రాదు.. ఇదంతా తెలిసి జగన్ పోరాటం చేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేయడం ఏంటని అందరూ అంటున్న మాట. అది కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా జగన్ పోరాటాన్ని ఢిల్లీలో పట్టించుకునే నాధుడే లేదు. బడ్జెట్ సమావేశాలు అయిపోయాక జగన్ పోరాటం చేసుంటే అక్కడ కాసింతైనా అటెన్షన్ దక్కించుకునేది. ఢిల్లీలో ధర్నా చేస్తే ఒరిగేదేమి లేకపోయిన ప్రతిపక్ష హోదా కోసం జగన్ పోరాటం చేయడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే జగన్ వ్యూహాలు జగన్ కు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 40 శాతం ఓట్లు వచ్చిన తనకు ప్రతిపక్ష లీడ్ హోదా కూడా ఇవ్వడం లేదన్న సానుభూతి కోసమే.. ఈ అంశాన్ని ఎక్కువ కాలం ప్రజల్లో ఉంచాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. తనను వేధిస్తున్నారని సానుభూతి సంపాదించేందుకు ఈ అస్త్రాన్ని ఉపయోగించుకుంటున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతున్న జగన్ అందుకు తగ్గట్లు ప్రవర్తించడం లేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ అనంతరం గవర్నర్ ప్రసంగిస్తుండగానే. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి సభ సాంప్రదాయలను పట్టించుకోలేదు. ప్రతిపక్ష లీడర్ హోదా కావాలన్న జగన్ ప్రభుత్వంతో పోరాడేది అసెంబ్లీలోనే కాని ఢిల్లీలో కాదు. ప్రజా సమస్యలే ఆయుధంగా, ప్రజా సమస్యలే కవచంగా జగన్ అసెంబ్లీలోనే పోరాడవలసి ఉంటుందన్న విషయం జగన్ గుర్తుంచుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE