మాజీ మంత్రి దేవినేని ఉమాకు బెయిల్ మంజూరు

Andhra Pradesh, AP High Court Grants Bail For TDP Senior Leader, AP High Court Grants Bail For TDP Senior Leader Devineni Uma, AP High Court grants bail to Devineni Uma, Bail For TDP Senior Leader Devineni Uma, Devineni Uma, Devineni Uma Bail, Devineni Uma Gets Bail, Finally Devineni Uma Gets Bail, High Court grants bail to TDP leader, Mango News, TDP Senior Leader, TDP Senior Leader Devineni Uma

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు బుధవారం నాడు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీప్రాంతంలో పర్యటన, అనంతరం జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామం వద్ద చోటుచేసుకున్న ఘటనలో దేవినేని ఉమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌ తో పాటుగా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు కోర్టు 14 రోజుల పాటుగా రిమాండ్‌ విధించడంతో రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసులపై దేవినేని ఉమా హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టి ఇరువర్గాలు వాదనలు విన్న హైకోర్టు, తాజాగా దేవినేని ఉమాకు బెయిల్‌ మంజూరు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here