వైసీపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై?.. త్వరలో టీడీపీలోకి..?

AP, YCP Sitting MLA, MLA Maheedar Reddy, CM Jagan, YCP MLA Kotamreddy, MaheedharReddy, APAssembly, N Chandrababu Naidu, TDP, Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
AP, YCP Sitting MLA, MLA Maheedar Reddy, CM Jagan

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ హీటెక్కిపోతున్నాయి. జంపింగ్ రాజకీయాలు ఎక్కువవుతున్నాయి. అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నకొద్దీ అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. టికెట్ దక్కలేదని.. పార్టీలో సరైన ప్రధాన్యత లేదని పెద్ద ఎత్తున నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టికెట్ దక్కకపోవడంతో.. తెలుగు దేశం పార్టీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు మరో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ హైకమాండ్‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో హైకమాండ్ ఆయనకు టికెట్ నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజులుగా మహీధర్ రెడ్డి వైసీపీ హైకమాండ్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కూడా ఆయన సరిగా స్పందించడం లేదు. ఇదే విషయంలో హైకమాండ్ ఆయన్ను పలుమార్లు మందలించింది. అటు మహీధర్ రెడ్డి కూడా.. తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా.. బూతులు తిట్టే రాజకీయాలు తాను చేయబోనని బహిరంగంగానే ప్రకటించారు. ఈక్రమంలో వైసీపీ హైకమాండ్ ఆయనకు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది.

1989లో మహీధర్ రెడ్డి కాంగ్రెస్ తరుపున కందుకూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు కాగా.. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలుపొంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మళ్లీ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఆయన దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్‌ను కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుపున కందుకూరి నుంచి పోటీ చేసి గెలుపొందారు.

అయితే ఇటీవల జరిగిన పలు పరిణామాలు.. నియోజకవర్గంలో ఆయనకు ప్రజాబలం తగ్గిపోవడంతో వైసీపీ హైకమాండ్ ఆయన్ను ఈసారి సైడ్ చేసేసింది. ఆయన స్థానంలో కందుకూరి నుంచి కొత్త వ్యక్తిని బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. ఈక్రమంలో వైసీపీని వీడాలని మహీధర్ రెడ్డి ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిసినట్లు తెలుస్తోంది. పార్టీ మార్పుపై లోకేష్‌తో మహీధర్ రెడ్డి చర్చలు జరిపారట. అటు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో చంద్రబాబు నాయుడు సమక్షంలో మహీధర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + twenty =