కేంద్ర రాజకీయాల్లో ఓ చక్రం తప్పిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి ఆంధ్రప్రదేశ్‌లో గడ్డు కాలం వీస్తోందన్న టాక్ నడుస్తోంది. పురంధేశ్వరికి కాంగ్రెస్ కలిసొచ్చినట్లు బీజేపీ కలిసి రావడం లేదన్న టాక్ ఆ పార్టీలో వినిపిస్తోంది.కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినపుడు ఈజీగా విజయం సాధించిన పురంధేశ్వరిని తాజాగా ఓటమి భయం వెంటాడుతోందంటూ చర్చ నడుస్తోంది
ఎప్పుడయితే పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లారో అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమె ఖాతాలో ఒక్క గెలుపును నమోదు చేసుకోలేదు. బీజేపీ నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు పోటీ చేసి.. రెండు సార్లు కూడా ఓడిపోయారు. తాజాగా రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మరో సారి బరిలోకి దిగినా కూడా.. ఇప్పుడైనా గెలుస్తారో లేదా అన్నభయం ఆమెను వెంటాడుతుంది.
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె అయిన దగ్గుబాటి పురందేశ్వరి .. తన తండ్రి టీడీపీ వ్యవస్థాపకుడైనా కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ఆ సమయంలో నారా చంద్రబాబు నాయుడుతో నెలకొన్న విబేధాల వల్ల ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీని వీడారు. అప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించిన పురందేశ్వరి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. బాపట్ల పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
అప్పుడు కేంద్రంలో ఏర్పడిన ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో పురంధేశ్వరికి చోటు దక్కింది. 2006లో మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా ఆమె పని చేశారు. 2009లో బాపట్ల ఎస్సీ రిజర్వుడు కావడంతో పురంధేశ్వరి అక్కడ నుంచి మకాం మార్చి. విశాఖపట్నం పార్లమెంట్ నుంచి రెండో సారి పోటీ చేసి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పురందేశ్వరి 66వేలపైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొంది.. కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీని వీడి.. 2014లో బీజేపీలో చేరారు. అదే ఏడాదిలో రాజంపేట పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 2019 ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మరో సారి ఓడిపోయారు. 2023 జూలై 4న ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమించారు.
తాజాగా 2024 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ నుంచి బిజెపీ అభ్యర్థిగా పురంధేశ్వరి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో తొలి సారి మాత్రం సోషలిస్టు పార్టీ గెలవగా తర్వాత సీపీఐ గెలిచింది. తర్వాత అక్కడ నుంచి 9 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలవడంతో అది హస్తానికి కంచుకోటగా మారింది. అక్కడ మూడు సార్లు టీడీపీ గెలవగా, టీడీపీ మద్దతుతో కమలం పార్టీ రెండు సార్లు గెలిచింది. ఈ సారి కూటమి మద్ధతుతో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన పురంధేశ్వరి గెలుస్తారో లేదో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY