గత ఎన్నికల్లో 151 సీట్లు.. ఇప్పుడు చూస్తే కేవలం 11 సీట్లు మాత్రమే.. అసలు తప్పు ఎక్కడ జరిగింది.. ఎందుకు ఓడాం.. కారణాలేంటి?.. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏం చేయాలి?.. ప్రస్తుతం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పాలయింది. కేవలం 11 అంటే 11 స్థానాలకే పరిమితమయింది. గత ఎన్నికల్లో 21 పార్లమెంట్ స్థానాలను దక్కించుకున్న వైసీపీ.. ఈసారి 4 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ ఓటమికి గల కారణాలపై జగన్మోహన్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరుసగా పార్టీ నేతలు, సీనియర్లతో సమీవేశమవుతున్నారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌ను జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రధాన కార్యాలయంగా మార్చేశారు. అక్కడి నుంచే పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు. ఓటమికి గల కారణాలను వారితో కలిసి చర్చిస్తున్నారు. మరోసారి తప్పు జరగకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ నేతలు చెప్పేది వినడమే కాకుండా.. వారికి జగన్ పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
అయితే ఇటీవల కొద్దిరోజులుగా వైసీపీ నేతలు, కార్యాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులపై శ్రీకాకుళానికి చెందిన వైసీపీ ముఖ్యనేతలతో జగన్ సమావేశమై చర్చించారు. దాడులపై ఆరా తీశారు. రానున్న రోజులలో ఎలా వైసీపీని పటిష్టం చేయాలి దాడులను ఎదుర్కొని క్యాడర్ కి ఎలా రక్షణ కల్పించాలి అన్న దానిపై నేతలతో జగన్ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో శ్రీకాకుళానికి చెందిన వైసీపీ ముఖ్యనేతలు ధర్మాన ప్రసాదరావు, క్రిష్ణదాస్ పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE