వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అటెండ్ అవుతారా? లేదా? అన్న ఉత్కంఠకు తెర పడింది. కొద్దిరోజులుగా జగన్ అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ చర్చకు తెర దించుతూ జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ 16వ శాసన సభా సమావేశలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎమ్మెల్యేగా ఎంపిక అయిన వారంతా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈక్రమంలో శుక్రవాంరం తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి హాజరయిన జగన్.. అపోజిషన్ బెంచీలలో కూర్చొన్నారు. ఆ తర్వాత ఆయన రాగానే వెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య జగన్ చేత ప్రమాణం చేయించారు. మొదట్ వైఎస్ జగన్ మోహన్ అను నేను అంటూ చదివిన జగన్.. ఆ తర్వాత సవరించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణం చేశారు. ఆ తర్వాత స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గోరంట్ల బుచ్చయ్యకు నమస్కారం చేసి.. ఆయనతో మాట్లాడారు. తర్వాత రిజిస్టర్‌ల సంతకం చేసి.. నేరుగా తన ఛాంబర్‌కి వెళ్లరు. కేవలం 15 నిమిషాలు మాత్రమే జగన్ అసెంబ్లీలో ఉన్నారు.
అయితే ప్రమాణస్వీకారం చేసినప్పటికీ.. పూర్తిస్థాయిలో జగన్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది డౌటేనని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ఉన్నారు కాబట్టి జగన్ వచ్చి ప్రమాణ స్వీకారం చేశారని చెబుతున్నారు. ఆ తర్వాత స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఉంటే జగన్ అసెంబ్లీకి రావడం కష్టమేనని అంటన్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో..
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY