నాడు విమర్శలు.. నేడు జీతల పెంపు హామీ

What Is Chandrababu's Idea About Volunteers?, Chandrababu Idea, Idea About Volunteers, Volunteers, Chandrababu Naidu Promises 10000, 10000 Money For Volunteers, Money For Volunteers, Volunteers Money, Chandrababu, Volunteers News, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
chandrababu naidu promises 10000 money for volunteers telugu news

ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై రాజకీయ వేడి నెలకొన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంచలన హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగించడమే కాకుండా వారి గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని చంద్రబాబు చెప్పారు. వాలంటీర్లకు ప్రస్తుతం రూ.5 వేలు చెల్లిస్తుండగా వారికి నెలకు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రధాన్యతను సంతరించుకున్నాయి. 2.60 లక్షల మంది గ్రామ, వార్డు (పట్టణ ప్రాంతాల్లో) వాలంటీర్లను జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం లబ్ధిదారుల ఇంటి వద్దకే పౌరసేవలు అందించేందుకు నియమించిన విషయం తెలిసిందే!

ఓవైపు అలా.. మరోవైపు ఇలా:

అటు గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అనుమతించరాదని  టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా వైసీపీ ఆరోపిస్తోంది. నిజానికి ప్రతి నెలా వలంటీర్లు లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే పింఛన్లు చెల్లిస్తున్నారు. అయితే టీడీపీ-జనసేన-బీజేపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చంద్రబాబు నాయుడు చెబుతుండడంపై వైసీపీ మండిపడుతోంది. ఓవైపు వారిపై బురద జల్లుతూ మరోవైపు ఇలా మాట్లాడడమేంటని ప్రశ్నిస్తోంది.

నాడు విమర్శలు.. నేడు జీతల పెంపు హామీ:

మరోవైపు గ్రామ, వార్డు వలంటీర్లు అధికార పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తున్నారు. వాలంటీర్లు అధికార పార్టీ ఏజెంట్లుగా పనిచేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టీడీపీ-జనసేన నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. గత ఏడాది జూలైలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. మానవ అక్రమ రవాణా వెనుక రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల హస్తం ఉందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇక 175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 3 =