కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను సవరించిన ఏపీ ప్రభుత్వం

AP Government Revises Registration Charges in Newly Formed District Centres, Registration Charges in Newly Formed District Centres, Newly Formed District Centres, AP Government, 26 New Districts Declaration on April 4th, 26 New Districts, New District Formation, reorganisation of New districts, new districts Declaration on April 4th, New districts in AP Declaration on April 4th, New Districts in Andhra Pradesh, 13 new districts In AP, New District Formation In AP, Andhra Pradesh, Andhra Pradesh To Have Total of 26 Districts, New Districts in Andhra Pradesh, 13 new districts In AP, New District Formation In AP, Registration Charges, Newly Formed District Centres Registration Charges Latest News, Newly Formed District Centres Registration Charges Latest Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు కొత్తగా ఏర్పడిన జిల్లాల కేంద్రాలలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటైన 13 జిల్లా కేంద్రాలలో మాత్రమే రిజిస్ట్రేషన్‌ ఛార్జీల సవరణ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా జిల్లా కేంద్రాలుగా ప్రకటించిన తర్వాత అక్కడి ఆస్తుల విలువ పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అర్బన్‌, రూరల్‌ ఏరియాల మార్కెట్‌ విలువలను సవరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈరోజు కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం ప్రారంభించారు.

దీంతో.. కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో 26 జిల్లాల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం చెందింది. చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుంచి కొనసాగనున్న పరిపాలన ద్వారా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు చేరువకానుందని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో మరింత వేగంగా మరియు పారదర్శకంగా అమలు చేసే అవకాశం ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. జిల్లా కలెక్టర్, పోలీసు క్యాంపు కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. తద్వారా తమ పనుల కోసం సాధారణ ప్రజలు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అటూ, ఇటూ తిరిగే దుస్థితి తప్పిపోనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − three =