జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (బుధవారం, మే 10, 2023) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఇటీవలి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజక వర్గాల మీదుగా పవన్ పర్యటన సాగనుంది. ఈ మేరకు జనసేన పార్టీ వర్గాలు పత్రికా ప్రకటన విడుదల చేశాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంటలను పరిశీలించి, రైతులను కలుసుకుని వివరాలను తెలుసుకోనున్నారు. రైతులతో మాట్లాడటం ద్వారా వారి బాధలను స్వయంగా తెలుసుకోనున్నారు. ఇక ఈ పర్యటనలో పవన్‌తో కలిసి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు జిల్లా స్థానిక నేతలు పలువురు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముందుగా రేపు ఉదయం రాజమండ్రి చేరుకుని, అక్కడి నుంచి పర్యటన ప్రాంతాల రైతులను కలుసుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE








































