వినుకొండలో రషీద్ హత్యపై మాజీ ముఖ్యమంత్రి జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని జనసేన నాయకుడు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాకముందే విమర్శలు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న జగన్ డిమాండ్ పై నాగబాబు మండిపడ్డారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని దుర్మార్గ పాలన జగన్ హయాంలోనే చూశామని గుర్తు చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో ఈ హత్య జరిగిందన్నారు. జగన్ శవ రాజకీయాలు మానుకోవాలని.. రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు నాగబాబు.
శాసనసభ సమావేశాలను ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని నాగబాబు ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై పెట్టిన కేసులకు హద్దే లేదని.. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. గత ఐదేళ్లలో సామాన్య ప్రజలు నోరెత్తాలంటే భయపడి పోయారన్నారు. జగన్ పాలనలో లోపాలను ప్రశ్నిస్తే కొట్టారని.. ప్రతిపక్ష నేతల గొంతెత్తితే కేసులు పెట్టారన్నారు. గత జగన్ పాలనలో ఎన్నో దారుణాలకు పాల్పడ్డారని నాగబాబు గుర్తు చేశారు. అమాయకులను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు బుద్ధి చెప్పినా.. ఇంకా బుద్ధి మార్చుకోవడం లేదన్నారు. జగన్ ను అధికారంలోకి తీసుకురాకుండా ప్రజలు తమను తాము కాపాడుకున్నారని తెలిపారు.
ఇక పోలీసు వ్యవస్థను సైతం పూర్తిగా నిర్వీర్యం చేసిపారేశారన్నారు. ఐపీఎస్‌లను వైసీపీ నాయకులుగా మార్చి పని చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ శవ రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా జగన్ బుద్ధి మార్చుకోవడం లేదని ఫైరయ్యారు. ఇప్పుడు ఆయన నీతులు వల్లించడం అసలు బాగోలేదని విమర్శలు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ