జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నాడు కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం విజయవాడ చేరుకున్న ఆయన అక్కడి నుంచి బయలుదేరి గుడివాడ, పెడన మీదుగా మచిలీపట్టణం చేరుకున్నారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు 35 వేల రూపాయలు పరిహారంగా అందించాలని, తక్షణ సాయంగా పది వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ మచిలీపట్నంలోని కృష్ణాజిల్లా కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారికి పవన్ కళ్యాణ్ వినతి పత్రం అందజేశారు.
రైతులకి రూ.35 వేల విడుదల చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం:
ఈ పర్యటనలో ముందుగా గుడివాడలో ప్రజలనుద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. నివర్ తుఫాన్ వలన నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా పది వేల రూపాయలు విడుదల చేయాలి. అలాగే వచ్చే శాసనసభ సమావేశాల్లోగా రైతులకి రూ.35 వేల విడుదల చేయకపోతే జనసైనికులతో కలిసి నేనే దగ్గరుండి అసెంబ్లీని ముట్టడిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 35 వేల రూపాయలు రైతుకు ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతామో మేమూ చూస్తాం. అసెంబ్లీ సమావేశాలను విజయవాడ, వైజాగ్, పులివెందులలో ఎక్కడ నిర్వహించినా వస్తామని అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
“ఓడిపోయాక భయపడిపోతాం, పారిపోతాం అని కొందరు భ్రమ పడుతున్నారు. ఆశయం ఉన్న వాడికి ఓటమి ఉండదు, ముందడుగే ఉంటుందని అన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా బాధ్యతగా వ్యవహరించకపోతే, వాళ్లు ఏ స్థాయి వ్యక్తులైనా రోడ్ల మీదకు తీసుకురాగల సత్తా జనానికి ఉంది. ప్రజలను భయపెట్టి పాలిద్దాం అంటే సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. మొదటసారిగా గుడివాడ వచ్చాను. జీవితంలో మరిచిపోలేని ఘనస్వాగతం పలికారు. ఈ అనుభూతిని చివరి శ్వాస వరకు గుర్తు పెట్టుకుంటాను. రహదారుల దుస్థితిపై ప్రజాప్రతినిధులను నిలదీయాలి. కంకిపాడు నుంచి గుడివాడ వచ్చే దారిలో రోడ్లు అస్తవ్యవస్థగా ఉన్నాయి. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులను ప్రజలు ప్రశ్నించాలి. అన్ని కులాలు, అన్ని మతాలకు సమ న్యాయం జరగాలనే జనసేన పార్టీ స్థాపించాను. అంతిమ శ్వాస వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అండగా నిలబడతాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మీ సీఎం సాబ్ కి ఈ వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి..
వచ్చే శాసన సభ సమావేశాల్లోగా నష్టపోయిన రైతులకి రూ.35 వేల పరిహారం అందించకపోతే జనసైనికులతో కలిసి అస్సెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం – JanaSena Chief Sri @PawanKalyan#JSPStandsWithFarmers pic.twitter.com/gpWyO5wWsI
— JanaSena Party (@JanaSenaParty) December 28, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ