జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఆదివారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. అనంతరం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కలసి పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీ సమావేశంలో చర్చించిన అంశాలతో పాటు తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, ఆమోదించిన తీర్మానాల గురించి వివరించారు. ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ స్వయంగా అర్జీలు స్వీకరించే జనవాణి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించాలని నిర్ణయించినట్టు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గిరిజన జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రెండు ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే నవంబర్ 12,13, 14 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్ల వద్ద జనసేన పార్టీ తరఫున సోషల్ ఆడిట్ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వయంగా పవన్ కళ్యాణ్ పాల్గొననున్నట్టు తెలిపారు.
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాష్ట్రవ్యాప్తంగా నాలుగు విడతలు జనవాణి కార్యక్రమం నిర్వహించాం. తిరుపతి వేదికగా జరిగిన నాలుగో విడత జనవాణి కార్యక్రమంలోనూ విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల తదుపరి జనవాణి కార్యక్రమం ఉంటుందని ప్రకటించాం. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్న విషయాన్ని కూడా వెల్లడించాం. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నాలుగు విడతల జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 2781 అర్జీలు పవన్ కళ్యాణ్ స్వయంగా స్వీకరించారు. సామాన్య ప్రజలు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లే న్యాయం జరుగుతుందన్న ధైర్యంతో ఎంతో మంది జనవాణి కార్యక్రమానికి తరలివచ్చారు. జనసేన పార్టీకి అందిన అర్జీల్లో 28 ప్రభుత్వ శాఖల నుంచి 1671 అర్జీలు సమర్పించి అక్నాలజ్జిమెంట్లు స్వీకరించడం జరిగింది. విశాఖలో జనవాణి కార్యక్రమం జరిగితే అధికార పార్టీ నాయకుల దాష్టీకాలు, ముఖ్యంగా భూ స్కాములు బయటపడతాయన్న ఉద్దేశంతోనే ఆ కార్యక్రమం జరగకుండా కుట్ర పన్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అర్ధమయ్యింది. ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకునేందుకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 26 జిల్లాలకు ఉన్న 26 రాజధానుల్లో జనవాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం. గిరిజన జిల్లాలో మాత్రం ప్రజల సౌలభ్యం కోసం పాడేరు, రంపచోడవరంలలో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE







































