రాష్ట్రీయ ఏక్తా దివస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా నివాళులు

PM Modi Participates Rashtriya Ekta Divas in Gujarat's Kevadia and says We Need To Take Inspiration From Sardar Patel, PM Narendra Modi, Modi Participates Rashtriya Ekta Divas, Gujarat's Kevadia, Mango News, Mango News Telugu, Modi Says Take Inspiration From Sardar Patel, PM Modi Latest News And Updates, Rashtriya Ekta Divas, Rashtriya Ekta Divas Updates, PM Modi Rashtriya Ekta Divas, PM Modi News And Live updates

గుజరాత్‌లోని కేవడియాలో ఉన్న ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద ఈరోజు జరిగిన రాష్ట్రీయ ఏకతా దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలో నేడు స‌ర్దార్ వల్లభ్ భాయ్ ప‌టేల్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయన పూల మాల‌లు వేసి నివాళులర్పించారు. ఇక ఈ ఏక్తా దివస్ పరేడ్‌లో బీఎస్ఎఫ్ సహా మరో ఐదు రాష్ట్రాల పోలీసు బలగాల సభ్యులు కూడా పాల్గొన్నారు. వీరితోపాటు 2022 కామన్వెల్త్ గేమ్స్ లో పోలీస్ స్పోర్ట్స్ మెడల్ సాధించిన ఆరుగురు విజేతలు కూడా పరేడ్‌లో పాల్గొన్నారు. కాగా మోర్బీ బ్రిడ్జి కూలిన దుర్ఘటన భారీగా ప్రజలు మృత్యువాత పడిన నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగిస్తూ.. సర్దార్ పటేల్ నుండి మనం స్ఫూర్తి పొందాలని, ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. మ‌న దేశాన్ని ఏకం చేయ‌డంలో స‌ర్దార్ ప‌టేల్ యొక్క అమూల్య‌మైన పాత్ర‌కు రాష్ట్రీయ ఏక్తా దివ‌స్ నివాళి అని పేర్కొన్నారు. ఐక్యత అనేది భారతదేశానికి ఎప్పుడూ ప్రత్యేకత అని, అయితే నేటికీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరియు విభజించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. దేశాన్ని మతం, కులం, భాషల వారీగా విభజించేందుకు ప్రయత్నించే ప్రతికూల ప్రయత్నాలను ప్రజలు గమనించాలని ప్రధాని మోదీ సూచించారు. ఇక సర్దార్ పటేల్ ఆశించిన విధంగా దేశంలోని పౌరులందరికీ సమాన అవకాశాలను అందించడం ద్వారా ప్రజలను అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =