నేటి నుంచి గన్నవరం విమానాశ్రయంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

AP International Flight Services Starts at Gannavaram Airport From Today, AP International Flight Services, International Flight Services In AP, AP Gannavaram Airport, Gannavaram Airport International Flight Services, Mango News, Mango News Telugu, Gannavaram Airport, AP Gannavaram Airport International Flight Services, AP Gannavaram Airport , Gannavaram Airport Latest News And Updates, AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

విజయవాడ ప్రాంత ప్రజలకు శుభవార్త. వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు గన్నవరం విమానాశ్రయంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మచిలీపట్నం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలియజేశారు. కేంద్ర విమానయానశాఖ మంత్రి మరియు ఎయిర్ ఇండియా అధికారులతో పలుదఫాలుగా రాష్ట్రం తరపున చేసిన వినతులపై వారు స్పందించారని, సాధ్యాసాధ్యాలపై కీలక చర్చలు జరిపిన తర్వాత అనుమతులు లభించాయని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి షార్జాకు వారంలో రెండు రోజులపాటు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయని ఎంపీ బాలశౌరి తెలిపారు.

ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి సోమవారం మరియు శనివారం రాత్రి గం.9:05 ని.లకు ఇక్కడినుంచి విమానం బయలుదేరుతుందని ఎంపీ వివరించారు. ఈ క్రమంలో నేడు షార్జాకు తొలి విమాన సేవలు ప్రారంభమవుతున్నట్లు ప్రకటించారు. షార్జా వెళ్లనున్న ప్రయాణికులకు ఆయన బోర్డింగ్ పాసులు అందజేయనున్నారు. అలాగే మస్కట్ మరియు కువైట్ దేశాలకు కూడా విమానాలు నడుస్తాయని తెలిపారు. మస్కట్ కు ప్రతి శనివారం మధ్యాహ్నం గం.1:15 ని.లకు, కువైట్ కు ప్రతి బుధవారం సాయంత్రం గం.4:30 ని.లకు విజయవాడ నుంచి సర్వీసులు నడుస్తాయని ఎంపీ బాలశౌరి వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =