టీడీపీ నేత నారా లోకేష్ తో కన్నడ స్టార్ హీరో, కేజీఎఫ్ ఫేమ్ యశ్ భేటీ

Kannada Star Hero Yash Meets TDP Leader Nara Lokesh at Hyderabad

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో గురువారం ప్రముఖ కన్నడ స్టార్ హీరో, కేజీఎఫ్ ఫేమ్ యశ్ భేటీ అయ్యారు. రాజకీయ, సినీ వర్గాలకు చెందిన వీరిద్దరి భేటీ ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్‌ లో నారా లోకేష్, యశ్ భేటీ దాదాపు అరగంట పాటుగా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే వీరిద్దరూ ఏఏ అంశాలపై చర్చించారనే దానిపై ఇంకా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు కేజీఎఫ్ చాప్టర్-1, కేజీఎఫ్ చాప్టర్-2 సినిమాలతో యశ్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే. తన తదుపరిలో సినిమాను ఎంచుకునే పనిలో యశ్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా గురువారం నారా లోకేష్ తో యశ్ సమావేశం కావడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE